ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా తగ్గడం లేదు. బాబును కాల్చేయాలని జగన్ చేసినట్లుగా పేర్కొంటున్న వ్యాఖ్యలను పలువురు తప్పుపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ - టీడీపీ పరస్పర వాదోపవాదాలు సాగాయి. ఈ కామెంట్లు ఉన్నా తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం ఆ వ్యాఖ్యలను తప్పుపట్టారు. అయితే ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఉండవల్లి.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద అబద్దాల కోరు అనే మాటలో ఎలాంటి సందేహం లేదని ఉండల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. బాబు లాంటి అబద్దాల కోరును తన రాజకీయా జీవితంలో చూడలేదని ఎద్దేవా చేశారు. అయితే, బాబుపై జగన్ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఉండవల్లి అన్నారు. చంద్రబాబు పాలనపై వ్యతిరేకత ఉన్నప్పటికీ దాన్ని విశ్లేషించే విధానంలో జగన్ మార్పు తెచ్చుకోవాలన్నారు. కనీసం బాబు వయసుకు అయిన జగన్ గౌరవం ఇవ్వాలని, ఈ పరిణతిని జగన్ సాధించాలని కోరారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరును ఉండవల్లి ఎద్దేవా చేశారు. బాబు మాటలు కోటలు దాటుతున్నాయని, ఆయన అబద్దాలకు అంతేలేకుండా పోతోందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదని, దాదాపు ఈ ఏడాది చివరి నాటికి కూడా పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని ఉండవల్లి పేర్కొంటూ అయినప్పటికీ... ఆగస్టు నెలలో ఈ ప్రాజెక్టును చంద్రబాబు జాతికి అంకితం చేయడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. ఇక కీలకమైన పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ ఇదే తీరు ఉందన్నారు. ప్రతిఏటా కేవలం మూడు శాతం పని మాత్రమే సాగుతోందని ఉండవల్లి అన్నారు. ఇలా చేసుకుంటూ పోతే...ఇంకో ఐదేళ్లయినా ప్రాజెక్టు పూర్తికాదని తెలిపారు.