జగన్ హైదరాబాదుకు పోయి చికిత్స చేయించుకుని మన రాష్ట్రాన్ని అవమానించాడని చంద్రబాబు ఫీలవుతున్నాడు గాని జగన్ చంద్రబాబుకు హెల్ప్ చేసినట్టే అనిపిస్తుందని జగన్ పై దాడి విషయమై ఉండవల్లి వ్యాఖ్యానించారు. దాడి విషయంలో వైఎస్ జగన్ చాలా సాధారణంగా వ్యవహరించారని...దాని వల్ల జగన్ రాష్ట్రానికి మేలు చేసినట్లే లెక్క అన్నారు. జగన్ ఆ దాడిని రాజకీయంగా వాడుకోలేదన్నది ఉండవల్లి పాయింట్.
అదెలా అంటే... జగన్ కనుక తనే ప్లాన్ చేసి పొడిపించుకుని సానుభూతి కోరుకుని ఉంటే సీన్ మరోలా ఉండేదన్నారు. దాడి జరిగిన వెంటనే జగన్ అక్కడ పడిపోయి హడావుడి చేసేవాడు. అపుడు రాష్ట్రం అల్లర్లతో అల్లాడిపోయేది. చివరకు చంద్రబాబుకు చాలా చెడ్డ పేరు వచ్చేదని ఉండవల్లి అన్నారు. చిన్న గాయమే కాబట్టి జగన్ ప్రథమ చికిత్స చేయించుకుని హైదరాబాదు వెళ్లిపోయారని - ఇందులో జగన్ ఎక్కడా అసాధారణంగా వ్యవహరించినట్టు అనిపించడం లేదన్నారు.
చంద్రబాబు వ్యవహారమే నాకు తేడాగా అనిపించిందని వై.ఎస్. జగన్ ను ఎవడో కత్తితో పొడిస్తే చంద్రబాబు అందులో అంత ఆనందం ఏం కనిపిందో అర్థం కావడం లేదన్నారు ఉండవల్లి. నాకు తెలిసి చంద్రబాబు జీవితంలో అంతలా నవ్వడం ఆ దాడి తర్వాతే చూశాను అన్నారు. వైఎస్ ఆర్ కు నటించడం ఇష్టం ఉండదని - బహుశా అలాంటి లక్షణమే జగన్‌కు ఉండటం వల్ల దాని గురించి రాద్ధాంతం చేయకుండా తన షెడ్యూలు ప్రకారం హైదరాబాదు వెళ్లిపోయాడని అన్నారు.
జగన్ ఆల్రెడీ హిట్... ఇంకా కత్తి డ్రామాలు ఆడతాడని నేను అనుకోవడం లేదని ఉండవల్లి అనడం గమనార్హం. కొంపదీసి చంద్రబాబు కేవలం కత్తి ఎవరు ఇచ్చారు ? అనే నినాదంతో ఎన్నికలకు వెళ్తాడేమో అని సెటైర్ వేశారు. జగన్ పాదయాత్రలకు స్పందన చూస్తుంటే... డ్రామాలు - స్వయం దాడులు జగన్ కు అవసరం లేదని ఉండవల్లి అన్నారు. దాడి వెనక ఎవరు ఉన్నారో నిందితుడికి నార్కో అనాలసిస్ టెస్టు చేస్తే సరిపోతుందని ఉండవల్లి సూచించారు.