ఏపీకి హోదా ఇవ్వ‌డం మోడీకి భ‌య‌మా?

Update: 2016-09-09 10:08 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా ప్ర‌త్యేక ప్యాకేజీకే కేంద్రం ప‌రిమితం అవ‌డంపై టీడీపీ - బీజేపీ మిన‌హా అన్ని రాజ‌కీయ ప‌క్షాలూ కామెంట్లు కుమ్మ‌రించేస్తున్న సంగ‌తి తెలిసింది. ఈ లైన్‌లోకే వ‌చ్చేశారు. రాజ‌మండ్రి ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌ కుమార్‌. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డంపై ప్ర‌ధానిన రేంద్ర మోడీ భ‌య‌ప‌డుతున్నార‌ని ఆయ‌న అన్నారు. దీనికి రీజ‌న్ కూడా ఉండ‌వ‌ల్లి చెప్పారు. ప్ర‌స్తుతం పెట్రోలియం ప‌రిశ్ర‌మ‌ల‌తో గుజ‌రాత్ కిట‌కిట లాడుతోంద‌ని, అయితే, ఆ ప‌రిశ్ర‌మ‌ల‌కు ముడిస‌రుకు అంతా ఏపీ నుంచే వెళ్తోంద‌ని ప్ర‌త్యేక హోదా ఇస్తే.. ఏపీలో ఎక్క‌డాలేని రాయితీలు వ‌స్తాయ‌ని దీంతో గుజ‌రాత్ ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ.. ఏపీకి వ‌చ్చేస్తాయ‌ని ఇప్పుడు ఇదే విష‌యంలో మోడీ భ‌య‌ప‌డుతున్నార‌ని ఉండ‌వ‌ల్లి చెప్పుకొచ్చారు. ఇక‌, హోదా విష‌యంలో చంద్ర‌బాబు నిజాలు వెల్ల‌డించాల‌న్నారు. ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకోవాల్సి వ‌చ్చిందో ఆయ‌న చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

కేంద్రం - చంద్ర‌బాబు కుమ్మ‌క్క‌య్యాయ‌ని నిల‌దీశారు. హోదా ఇవ్వ‌క‌పోవ‌డంపై చంద్ర‌బాబు కేంద్రాన్ని ఎందుకు నిల‌దీయ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. హోదాకు వ్య‌తిరేకంగా ఏ ఒక్క‌రాష్ట్రం కూడా ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌ని చివ‌రికి తెలంగాణ కూడా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డంపై ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌లేద‌ని, అలాంట‌ప్పుడు చంద్ర‌బాబు ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని అన్నారు. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనే పద్ధతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, అందుకే ప్రశ్నించాల్సి వస్తోందని ఉండవల్లి అన్నారు. ఇక‌, ఏపీ అసెంబ్లీ గురించి మాట్లాడుతూ.. హోదాపై ఎట్టిప‌రిస్థితిలోనూ టీడీపీ ప్ర‌భుత్వం అసెంబ్లీలో చ‌ర్చించద‌ని తేల్చిచెప్పారు.

ఇప్ప‌డు మూడు రోజుల వ‌ర‌కే ప‌రిమిత‌మైన అసెంబ్లీ స‌మావేశాలు రానున్న రోజుల్లో మూడు నిమిషాల‌కే ప‌రిమితం అయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌ని సటైర్లు కుమ్మేశారు. స‌మావేశాల్లో చ‌ర్చ‌కు అవ‌కాశం ఇవ్వాల్సిన బాధ్య‌త అధికార ప‌క్షంమీదే ఉంటుంద‌ని చెప్పారు. తెల్ల‌వారి లేస్తే.. పార‌ద‌ర్శ‌క‌త గురించి లెక్చ‌ర్లు ఇచ్చే సీఎం చంద్ర‌బాబు.. తాను రాసిన లేఖ‌ల‌పై ఎందుకు స్పందించ‌డం లేద‌ని ఉండ‌వ‌ల్లి ప్ర‌శ్నించారు. ఇదేనా పార‌ద‌ర్శ‌క‌త అన్నారు. మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత ఘోరంగా మోసం చేస్తుందో పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో చెబుతానని ఆయన అననారు. బిజెపి వాళ్లు చెప్పేది నమ్మవద్దని ఆ రాష్ట్రాల ప్రజలకు చెబుతానని అన్నారు. ఏదేమైనా ఉండ‌వ‌ల్లి వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా ఉన్నాయంటున్నారు విశ్లేష‌కులు.
Tags:    

Similar News