రాజకీయాల్లో తనదైన విశ్లేషణలతో ప్రత్యేకతను సంపాదించుకున్న నేతగా ఉండవల్లి అరుణ్ కుమార్‌కు మంచి పేరే ఉంది. ఏ అంశంపై అయినా సమగ్ర అవగాహన వచ్చాకే నోరు విప్పే తత్వమున్న ఉండవల్లి... మీడియా ముందుకు వస్తున్నారంటే... ఏదో బ్రహ్మాండం బద్ధలువుతున్నట్లుగానే విశ్లేషణలు సాగుతున్న వైనం మనకు కొత్తేమీ కాదు. ఉండవల్లి ప్రెస్ మీట్ అంటేనే... యావత్తు మీడియా అలర్ట్ అయిపోతున్న వైనమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే నేటి ఉదయం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఉండవల్లి అందరూ ఊహించినట్లుగానే పెద్ద సంచలనమే సృష్టించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సాగుతున్న పోరాటంతో పాటు ఈ పోరాటంలో టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరు, ఇతర పక్షాల పోరాటం, అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రావడం లేదన్న విషయంతో పాటు... ఓటుకు నోటిచ్చే రాజకీయాలపై ఉండవవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.
హోదా కోసం అధికార టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని నాటకంగానే అభివర్ణించేసిన ఉండవల్లి.... హోదా రాదన్న విషయం చంద్రబాబుకు ఎప్పుడో తెలుసన్న విషయాన్ని మరోమారు చెప్పేశారు. రాని హోదా కోసం చంద్రబాబు యత్నిస్తున్నారని, బాబు పోరాటమంతా వెంట్రుకను వేసి కొండను లాగాలని ప్రయత్నిస్తున్న చందంగా ఉందని ఆయన విమర్శలు గుప్పించారు. హోదా రాదని చంద్రబాబుకూ తెలుసునని... ప్రజలను మభ్యపెట్టేందుకే తన పార్టీ ఎంపీలతో నాటకాలు ఆడిస్తున్నారని ఉండవల్లి నిప్పులు చెరిగారు. గత నాలుగేళ్లలో ఏపీకి రూ. 18.50 లక్షల పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు అసెంబ్లీలో చేసిన ప్రకటనను గుర్తు చేసిన ఉండవల్లి... ఇంతగా పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి చెప్పుకుంటుంటే, ఇక హోదా - పన్ను రాయితీలు ఎందుకని వస్తాయని ప్రశ్నించారు. ఇండియాకు వచ్చే మొత్తం పెట్టుబడులలో ఇది 20 శాతానికి సమానమని ఆయన తేల్చేశారు. పాలనలో విఫలమైన అధికార పార్టీ అందుకు ప్రతిపక్షం కారణమని చెప్పడం విడ్డూరంగా ఉందని ఉండవల్లి సెటైర్ వేశారు. ఆంధ్రప్రదేశ్ బాగు పడాలంటే ఒక్క 2019 ఎన్నికలు చాలని ఉండవల్లి అన్నారు. వచ్చే ఎన్నికల్లో డబ్బు ఇచ్చిన వాడికి ఓటెయ్యెద్దని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు. డబ్బు ఖర్చు పెట్టినవాడు ఈ ఎన్నికల్లో ఓడిపోయి తీరాలని, అప్పుడే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
ఇంకా ఉండవల్లి ఏమన్నారంటే... *ఓటేయండి అని అడిగేప్పుడు ప్రత్యేక హోదా ఇలా సాధిస్తాం అని ప్రజలకు వివరించండి. ఏదో ఒకటి చెప్పండి. మా దగ్గర వెంట్రుక ఉంది.. వెంట్రుకను ముడేసి కొండను లాగుతామని చెప్పండి చంద్రబాబు. ఎన్నికలకు అప్పుడే ఆశావాహులు రెడీ అవుతున్నారు. ఓటుకు కనీసం రెండు వేల చొప్పున ఇవ్వాలట. ఉన్నవాళ్లు ఆస్తులు అమ్మడానికి లేనివాళ్లు అప్పులు చేసి పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఓటుకు కనీసం రెండు వేలు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ బాగు పడాలంటే రాబోయే ఒక్క ఎలక్షన్ చాలు. ఈ ఒక్క ఎలక్షన్ లో డబ్బు ఇచ్చిన వాడికి ఓటెయ్యెద్దని ప్రజలందరినీ కోరుతున్నా. డబ్బు ఖర్చు పెట్టినవాడు ఓడిపోవాలి. ఇది చిన్న విషయం కాదు. మోసం రాజకీయ నాయకులు చేయగలరేమో కానీ పేదవాడు చేయలేడు. లోపలికి వెళ్లి మిషన్ స్విచ్ నొక్కే సమయంలో అంతరాత్మను పేదవాడు మోసం చేయలేడు*అని ఆయన అన్నారు.