మండే బేసి సంఖ్య.. మంగళవారం సరి సంఖ్య

Update: 2015-12-07 04:04 GMT
దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో వాహనాల జోరు తగ్గించటం.. వాహనాల ద్వారా వచ్చే కాలుష్యాన్ని తగ్గించటం కోసం ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం తెలిసిందే. వాహనంలోని చివరి అంకె సరి సంఖ్యలు (0..2..4..6..8.) ఒక రోజు.. బేసి సంఖ్యలు (1..3..5..7..9) అంకెలున్న కార్లు మరో రోజు బయటకు తీయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి స్టార్ట్ కాబోతున్న ఈ నిబంధనకు సంబంధించి మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ఢిల్లీ సర్కారు నిర్ణయించిన దాని ప్రకారం.. సోమ.. బుద.. గురు వారాల్లో బేసి సంఖ్య ఉన్న వాహనాల్ని మాత్రమే బయటకు తీయాల్సి ఉంటుంది. ఇక.. మంగళ.. గురు.. శనివారాల్లో మాత్రం సరి సంఖ్యలున్న వాహనాలు మాత్రమే ఢిల్లీ వీధుల్లో పరుగులు తీయనున్నాయి.

ఈ నిబంధన అన్ని ప్రైవేటు వాహనాలకు వర్తిస్తుందని.. దీనికి లాయర్లు.. ప్రభుత్వ అధికారులు.. నేతలు.. ప్రజాప్రతినిధులు ఇలా ఎవరూ అతీతులు కాదని తేల్చేశారు. ఎవరికైనా సరే ఈ రూల్ వర్క్ అవుతుందని.. నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోనున్నారు. ఈ నిబంధనలో అంబులెన్స్ లు.. ఫైర్ సర్వీసు వాహనాలతో పాటు ప్రభుత్వ వాహనాలను మినహాయించారు. మరి.. కేజ్రీవాల్ తీసుకున్న ఈ నిబంధనకు ప్రజల నుంచి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.
Tags:    

Similar News