అండర్ వరల్డ్ డాన్ కు అదిరిపోయే షాకిచ్చారు

Update: 2017-01-03 22:30 GMT
ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.15వేల కోట్ల రూపాయిలు నష్టం వాటిల్లేలా చేయటం మామూలు విషయమా? అది కూడా.. దేశం కాని దేశంలో తనకింత నష్టాన్ని కలిగించిన ప్రధానిని అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అస్సలు మర్చిపోలేరేమో. దేశ ప్రధానులుగా ఎవరున్నా.. తన హవా నడిచే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోని దావూద్ కు తొలిసారి భారీ షాక్ తగిలింది.

ఆయనకు చెందిన బారీ ఆస్తుల్ని దుబాయ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ లోని దావూద్ కు చెందిన రూ.15వేల కోట్లు విలువైన ఆస్తుల్ని అక్కడి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దావూద్ కు సంబంధించిన ఆస్తుల వివరాల్ని యూఏఈ ప్రభుత్వానికి భారత్ లోని మోడీ సర్కారు అందించింది.

గత ఏడాది యూఏఈలో పర్యటించిన ప్రధాని మోడీ.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ లు కలిసి.. దుబాయ్ అధికారులకు దావూద్ ఆస్తులపై తాముచేస్తున్న విచారణకు సహకరించాల్సిందిగా కోరారు. దీనిపై జరిగిన ఒప్పందంలో భాగంగా.. దుబాయ్ లో దావూద్ సోదరుడు నడుపుతున్న కంపెనీని గుర్తించటమే కాదు.. మొరాకో.. స్పెయిన్.. యూఏఈ.. సింగపూర్.. థాయిలాండ్.. సైప్రస్.. టర్కీ.. భారత్.. పాకిస్థాన్.. యూకేలలోఆస్తులు ఉన్నాయి. తాజాగా రూ.15వేల కోట్ల ఆస్తుల్ని అక్కడి ప్రభుత్వం ఇచ్చిన షాక్ తో అండర్ వరల్డ్ డాన్ కు దిమ్మ తిరిగిపోవటం ఖాయమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News