కొన్ని దేశాలు ఎంతోకాలంగా వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. పలు తీవ్రవాద కార్యక్రమాలకు కారకుడిగా భావిస్తున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం 60వ పుట్టిన రోజు జరగనుంది. శనివారం నాటికి దావూద్ కు అరవైఏళ్లు నిండుతాయి. ఈ సందర్భంగా భారీ పార్టీ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రపంచంలోని ఎన్నో చీకటి వ్యాపారాల్ని నిర్వహిస్తున్న దావూద్ ఈ సందర్భంగా తన రిటైర్మెంట్ ను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.
దీనికి సంబంధించిన ప్రకటన.. బర్త్ డే రోజున ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో దావూద్ తన బర్త్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించే అవకాశం ఉందని.. ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందన్న విషయాన్ని మాత్రం ఎవరూ బయటపెట్టటం లేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పుట్టినరోజు పార్టీని నిర్వహిస్తున్నట్లుగా ఆహ్వానాలు అందినప్పటికీ.. వేదిక ఎక్కడన్న విషయాన్ని మాత్రం బయటపెట్టటం లేదు.
అతిధులను.. పార్టీ మొదలుకావటానికి ముందు పికప్ చేసుకుంటారని.. అందుకు సంబంధించిన సమాచారం కాస్త ముందుగా అందిస్తారని చెబుతున్నారు. ఇక.. పుట్టినరోజు కార్యక్రమంలో కీలకమైన అంశం ఏమిటంటే.. ఆయన తన వారసత్వాన్ని అప్పగించటం. ఢీ కంపెనీ పేరిట నిర్వహించే వ్యాపారాల్ని పలు దేశాల్లో నిర్వహిస్తున్న చీకటి వ్యాపార సామ్రాజ్య బాధ్యతల్ని దావూద్ సోదరుడు అనీస్ అహ్మద్ కు అందించే అవకాశం ఉందంటున్నారు. దావూద్ చీకటి వ్యాపార వార్షిక టర్నోవర్ రూ.66వేల కోట్లుగా ఉంటుందని చెబుతారు.