లవ్ మ్యారేజ్ చేసుకున్న కేంద్రమంత్రి

Update: 2016-08-11 06:34 GMT
కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కేంద్రమంత్రి హోదాలో ఉన్న ఆయన లవ్ మ్యారేజ్ కు సంబంధించి గతంలో ఆసక్తికరమైన కథనాలు వచ్చాయి. ప్రయాణంలో భాగంగా విమానంలో తాను చూసిన ఎయిర్ హోస్టెస్ ను తొలిచూపులోనే ప్రేమలో పడిన కేంద్రమంత్రి.. చివరకు తన మనసుకు నచ్చిన మగువ మనసును కొల్ల గొట్టారు.

మంత్రిగారి ప్రేమకు పిధా అయిన సదరు ఎయిర్ హోస్టెస్ తో గత కొంతకాలంగా సన్నిహితంగా ఉన్నారు. ఈ సందర్భంగా వీరికి సంబంధించిన కథనాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. ఇదిలా ఉండగా.. తమ ప్రేమకు ప్రమోషన్ ఇస్తూ వీరిద్దరూ తాజాగా వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఢిల్లీలో జరిగిన మంత్రి గారి పెళ్లి వేడుకకు.. ప్రధాని మోడీ హాజరయ్యారు. ఆయనతో పాటు.. పలువురు కేంద్రమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కేంద్రమంత్రి వివాహ వేడుకకు ఢిల్లీకి చెందిన పలువురు ప్రముఖులతో పాటు.. బీజేపీకి చెందిన నేతలు హాజరయ్యారు. భారీగా సాగిన ఈ వివాహ వేడుక అద్యంతం ఉల్లాసంగా సాగింది. బాబుల్ వ్యవహారం సినిమాటిక్ గా ఉండటం ఒక విశేషమైతే.. లేటు వయసులో ఆయన ప్రేమ వివాదంగా కంటే కూడా ఆయన ఇమేజ్ ను మరింత పెంచేలా ఉండటం గమనార్హం. కొద్దికాలంగా ప్రేమికులుగా ఉన్న కేంద్రమంత్రిగారి  తాజా వైవాహిక బంధం సూపర్ సక్సెస్ కావాలని కోరుకుందాం.
Tags:    

Similar News