అంచనాలకు తగ్గట్లే కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తున్న ఇద్దరు మంత్రులు నజ్మా హెప్తుల్లా.. జీఎం సిద్దేశ్వర తమ పదవులకు రాజీనామా చేశారు. దాదాపు వారం క్రితం ప్రధాని మోడీ తన మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొత్తగా 19 మంది మంత్రుల్ని తన జట్టులో చేర్చుకున్నారు. అదే సమయంలో.. కొందరిపై వేటు వేశారు. ఈ వేటులో నజ్మా హెప్తుల్లా.. సిద్దేశ్వర్ పేర్లు కూడా ఉన్నా.. వారిద్దరూ తమ పదవులకు రాజీనామాలు చేయలేదు.
అయితే.. విదేశీ పర్యటనలో ఉన్న నజ్మా.. తిరిగి రాగానే తన పదవికి రాజీనామా చేస్తారని.. అదేసమయంలో కర్ణాటకకు చెందిన భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సిద్ధేశ్వర్ బర్త్ డే సందర్భంగా అదే రోజున రాజీనామా బాగోదన్న మాటకు ఓకే అన్న మోడీ కారణంగా తమ పదవులకు రాజీనామా చేయలేదు. అయితే.. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగిన వెంటనే ప్రధాని మోడీ ఆఫ్రికా పర్యటనకు వెళ్లటంతో వీరి రాజీనామాలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి.
తాజాగా మోడీ తన విదేశీ పర్యటనను ముగించుకొని వచ్చేయటంతో ఈ ఇద్దరు మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేయాల్సి వచ్చింది. ముందుగా అనుకున్నట్లే తన ఫారిన్ ట్రిప్ ను ముగించుకొని వచ్చిన నజ్మా.. బర్త్ డే బాయ్ సిద్ధేశ్వర్ లు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరి రాజీనామాల్ని రాష్ట్రపతి ప్రణబ్ ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నజ్మా వ్యవహారాన్ని పక్కన పెడితే.. సిద్ధేశ్వర్ కు మాత్రం బర్త్ డే తోఫా ముగిసిందని చెప్పాలి.