రోహిత్ చట్టం చేసే వరకు పోరాడుతానని జేఎన్ యూ విద్యార్థినేత కన్హయ అన్నారు. కన్హయ్య హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. రోహిత్ తల్లిని పరామర్శించేందుకు ఇక్కడికి వచ్చానని అన్నారు. సాయంత్రం నిర్వహించే సభలో పాల్గొంటానని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో సామాజిక న్యాయం కోసం ప్రయత్నిస్తున్నానని, అడుగడుగునా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కన్హయ అన్నారు.
అంతకుముందు కన్హయకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీపీఐ నేత నారాయణతో పాటు పలువురు స్వాగతం పలికారు. క న్హయ కుమార్ హెచ్ సీయూకు రాకను పోలీసులు నిరాకరించారు. కన్హయ రాక అనుమతి లేదని స్పష్టం చేశారు. మరోవైపు కన్నయ కుమార్ రాక నేపథ్యంలో హెచ్ సీయూలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో వర్శిటీ అధికారులు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించారు. యూనివర్శిటీకి వెళ్లే గేట్లను మూసివేశారు. ప్రధాన ద్వారం దగ్గర పోలీసులు మోహరించారు. అలాగే వర్శిటీలో తాగునీరు విద్యుత్ కట్ చేశారు. మీడియాకు అనుమతి నిరాకరించారు. అటు కన్నయ రాకను ఏబీవీపీ వ్యతిరేకిస్తోంది. మరోవైపు యూనివర్శిటీలో కన్నయ కుమార్ సభా ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన సీపీఐ నేత అజీజ్ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ వీహెచ్ ను కూడా అడ్డుకున్నారు. కన్హయ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సభ జరుగుతుందని అంటున్నారు.