ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిషత్ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు అధికారులు తెలిపారు. ఆనంద్ సింగ్ అనారోగ్యంతో మార్చి 15న ఎయిమ్స్ లో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆయన కన్నుమూశారు. డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కాపడలేకపోయారు.
ఇకపోతే, మంగళవారం అయన స్వస్థలం ఉత్తరాఖండ్ లోని పౌరీ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే , కరోనా వ్యాప్తి నేపథ్యంలో తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు యోగి ఆదిత్యనాథ్. తన తండ్రి కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నామని ఆయన బాధపడ్డారు. నాన్న చివరి రోజుల్లో పక్కనే ఉండాలని నేను భావించా.. కానీ యూపీలోని 23 కోట్ల మంది ప్రజలను కాపాడడం నా బాధ్యత. అందుకే నాన్నతో ఉండలేకపోయా. అంత్యక్రియల సమయంలో సామాజిక దూరం పాటించాలని అమ్మను, కుటుంబ సభ్యులను కోరుతున్నా. లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఇంటికి వస్తా అని సీఎం యోగి తెలిపారు.
ఇకపోతే , ఆనంద్ సింగ్ బిష్త్ గతంలో ఉత్తరాఖండ్ అటవీ శాఖల ఫారెస్ట్ రేంజర్ గా విధులు నిర్వర్తించారు. ఆ తరువాత ఫారెస్ట్ రెంజ్ ఆఫీసర్ గా పదవీవిరమణ చేసిన ఆనంద్ సింగ్ బిషత్.. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని యమకేశ్వర్ జిల్లా పంచౌర్ గ్రామంలో నివసిస్తున్నారు. ఆనంద్ సింగ్ మృతిపై యూపీ గవర్నర్ అనందీబెన్ పటేల్ - బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ - కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తదితరులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.