కూతుర్ని రంగంలోకి దింపమంటున్నారు

Update: 2016-03-18 04:56 GMT
కొడుకు రాహుల్ మీద కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి పెట్టుకున్న ఆశల్ని కొడుకు ఎంతలా వమ్ముచేశారో రాహుల్ విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాహుల్ విషయంలో ముందుకు.. వెనక్కి వెళ్లలేని స్థితిలో ఉన్న సోనియమ్మ స్థితిని చూసిన కాంగ్రెసోళ్లు మధ్యేమార్గంగా ప్రియాంకమ్మను సీన్లోకి తీసుకురావటం తెలిసిందే.

రాహుల్ భయ్యా మీద పెట్టుకున్న ఆశలు వర్క్ వుట్ అయ్యే అవకాశం తక్కువగా ఉన్న నేపథ్యంలో.. తమకు మిగిలిన ఏకైక ఆప్షన్ అయిన ప్రియాంక మీద కాంగ్రెస్ క్యాడర్ భారీ ఆశల్ని పెట్టుకున్న సంగతి. ఈ విషయం మీద ఎలా మాట్లాడాలో కిందామీదా అర్థం కాని పరిస్థితుల్లో.. యూపీ కాంగ్రెసోళ్లు ఆ బాధ్యత తమ మీద వేసుకున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరిగే యూపీలో ప్రియాంకను కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్ ఊపందుకుంది.

ప్రియాంకమ్మను కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే.. రాజకీయ కలకలం చోటు చేసుకోవటంతో పాటు.. సెంటిమెంట్ రగిలిపోయి.. కాంగ్రెస్ కు విజయం పక్కా అన్నది కాంగ్రెస్ నేతలు వాదన. వారి ఆశలు ఎంతవరకు వర్క్ వుట్ అవుతాయన్నది పక్కన పెడితే.. ఆ మాటను పార్టీ అధినేత్రి ఓకే చెబుతారా? అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మరి.. యూపీ కాంగ్రెస్ నేతల డిమాండ్ కు సోనియమ్మ ఏం చెప్పనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News