పాక్ నుంచి వచ్చిన గీత తమ అమ్మాయే అంటోందో కుటుంబం. పదిహేనేళ్ల క్రితం భారత్ నుంచి తప్పిపోయి పాక్ కు చేరుకున్న చిన్నారిని.. అక్కడి ఒక స్వచ్చంద సంస్థ చేరదీయటం.. ఆమెకు గీత అని పేరు పెట్టి పెంచి పెద్దదాన్ని చేయటం తెలిసిందే. ప్రస్తుతం తన తల్లిదండ్రుల వద్దకు చేరుకునేందుకు భారత్ వచ్చిన ఆమె.. తన తల్లిదండ్రులుగా చెబుతున్న వారిని గుర్తు పట్టకపోవటం తెలిసిందే.
అయితే.. ఆమె తల్లిదండ్రులుగా భావిస్తున్న వారికి డీఎన్ ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక జంట గీతను తమ అమ్మాయిగా చెబుతున్నారు. యూపీకి చెందిన ప్రతాప్ గఢ్ జిల్లా మహేష్ గంజ్ ప్రాంతానికి చెందిన రామ్రాజ్ గౌతమ్.. అనరాదేవిలు గీత తమ అమ్మాయేనంటూ అలహాబాద్ డివిజనల్ కమిషనర్ ను ఆశ్రయించారు. తమ అమ్మాయి అనేందుకు అవసరమైన పరీక్షల్ని చేసుకోవాలని వారు కోరుతున్నారు.
చిన్నతనంలో తమ నుంచి తప్పిపోయిన తమ కుమార్తెకు సంబంధించిన ఫోటోలు తీసుకొచ్చిన వారు గీత అసలు పేరు సవితగా చెబుతున్నారు. ఈ విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తాజాగా పోలీసుల్ని ఆశ్రయించిన జంట కుమార్తే గీత అన్నది పోలీసులు తేల్చాల్సి ఉంది. గీత తల్లిదండ్రులు ఎవరో ఎప్పటికి తేలుతుందన్నది ఇప్పుడో పెద్ద ప్రశ్నగా మారింది.