ఇంట్లో ఎంచక్కా వండి పెట్టే భార్య దొరకటమే ఇవాల్టి రోజున్న పెద్ద లక్కీగా వ్యంగ్య వ్యాఖ్యలు చేసే భర్తలు చాలామందే కనిపిస్తారు. వంట చేయటం బాగా తగ్గిపోయిందని.. అందుకు నిదర్శనంగా కొత్త ఇళ్లల్లో కిచెన్ కు ఇస్తున్న ప్రాధాన్యం చూస్తే ఈ విషయం మరింత బాగా అర్థమవుతుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. నిజమే.. గతంతో పోలిస్తే.. ఇప్పుడు వంట తగ్గిపోవటం చాలామంది ఇళ్లల్లో కనిపిస్తున్నదే.
భార్యలు వంట చేయటం లేదని బాధ పడే భర్తలు చాలామందే కనిపిస్తారు. నిత్యం లడ్డూలు పెట్టే భార్యకు విడాకులు ఇస్తానంటూ ఒక భర్త బయటకు రావటం.. కోర్టు మెట్లు ఎక్కటం సంచలనంగా మారింది. ఎంచక్కా లడ్డూలు చేసే భార్య దొరికితే ఇంకేం కావాలని తొందరడి వ్యాఖ్య చేస్తే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. సదరు భార్య కేవలం లడ్డూలు మాత్రమే చేయటం.. అవి మాత్రమే తినిపించటంతో సదరు భర్త సహించలేకపోయాడు. కోర్టు ముందుకు వచ్చాడు. ఈ ఆసక్తికర ఉదంతంలో అసలేం జరిగిందన్నది చూస్తే.. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో ఆ విచిత్రమైన ఉదంతం చోటు చేసుకుంది.
భర్త అనారోగ్యానికి గురి కావటంతో భార్య ఒక తాంత్రికుడ్ని సంప్రదించింది. ఆమె అమయాకత్వాన్ని అసరా చేసుకున్నాడేమో కానీ.. భర్తకున్న జబ్బు నయం కావాలంటే కేవలం రోజుకు నాలుగు లడ్డూలు తప్పించి మరింకేమీ పెట్టొద్దని చెప్పాడు. తాంత్రికుడు మాటను జవదాటని సదరు భార్యామణి.. అతను చెప్పినట్లే రోజూ నాలుగు లడ్డూలు తప్పించి ఇంకేమీ పెట్టటం లేదు. ఎంత బ్రతిమిలాడినా ససేమిరా అంటోంది. పదేళ్ల తమ దాంపత్య జీవితంలో తన భర్త అనారోగ్యాన్ని తగ్గించింది లడ్డూలేనని ఆమె నమ్మకంగా చెప్పటం గమనార్హం. ఇదిలా ఉంటే.. దీనికి భిన్నమైన వాదనను వినిపిస్తున్నాడు భర్త.
దీంతో విసిగిపోయిన భర్త.. ఇక లాభం లేదనుకొని ఆమెతో తాను కాపురం చేయలేనని.. తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. భార్యకు విడాకుల కోసం అతను చెబుతున్న కారణం విన్న అధికారులు ఆశ్చర్యానికి గురి కావటమే కాదు.. కౌన్సిలింగ్ ఇస్తామని చెబుతున్నారు. అయితే.. భార్య వాదన మరోలా ఉంది. తాంత్రికుడు చెప్పినట్లు లడ్డూలు పెట్టిన తర్వాత నుంచి భర్త ఆరోగ్యంలో తేడా వచ్చిందని.. అతని అనారోగ్యం తగ్గిందని.. అందుకే తాను లడ్డూలు పెడుతున్నట్లుగా ఆమె చెబుతున్నారు. మొత్తానికి లడ్డూలు ఒక జంట మధ్య కొత్త గొడవకు కారణమైందని చెప్పక తప్పదు.