కరోనా సమయంలో ఓ కూలీ కుటుంబంలో విషాదం నిండింది. ఇంటిపెద్దను కాటేసింది. ఆ శవాన్ని కూడా తీసుకుపోలేని దారుణమైన ఈ ఘటన యూపీలోని గోరఖ్ పూర్ జిల్లా దుమ్రీఖండ్ గ్రామంలో చోటుచేసుకుంది.
దుమ్రీఖుండ్ గ్రామానికి చెందిన సునీల్ (38) ఒక వలస కూలీ. ఢిల్లీలో పనిచేసుకుంటూ బతికుతున్నాడు. ఢిల్లీలో ఇటీవల తట్టు వ్యాధితో చనిపోయాడు. అతడికి భార్య, పిల్లలు, తల్లిదండ్రులున్నారు. అయితే ఢిల్లీలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈనెల 14 ఢిల్లీ నుంచి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు.
అయితే సునీల్ మృతదేహాన్ని యూపీలోని సొంతింటికి తరలించడానికి రూ.25వేల డబ్బు అవసరమని తేలింది. అయితే డబ్బుల్లేక పూట గడవని కుటుంబం మథనపడింది. లాక్ డౌన్ తో ఎవరూ సాయం చేయలేని పరిస్థితి ఎదురైంది. దీంతో సునీల్ బొమ్మను తయారు చేసి ఫొటో పెట్టి గ్రామంలోనే అంత్యక్రియలు చేశారు.
తమకు మృతదేహాన్ని తీసుకుపోయే తాహతు లేదని తెలుపడంతో ఢిల్లీలో అధికారులే అక్కడ అంత్రక్రియలు నిర్వహించారు.
ఇలా శవాన్ని కూడా తీసుకుపోలేనంత పేదరికంతో ఆ కుటుంబం వదిలేసిన వైనం అందరినీ కంటతడిపెట్టింది.