దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటంతో పాటు.. హాట్ టాపిక్ గా మారిన లఖీమ్ పూర్ ఖేరీ ఘటన వేళ.. ఈ మొత్తానికి కారణమైన కేంద్రమంత్రి అజయ్ కుమార్ కు సంబంధించిన పాత వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో కేంద్రమంత్రిగారి బలుపు ఎంతన్న విషయాన్ని స్పష్టం చేసేలా సదరు వీడియో ఉందన్న మాట వినిపిస్తోంది. ఆయనకు రైతుల మీద ఎంత ఆగ్రహం ఉందన్న విషయం సోషల్ మీడియా సాక్షిగా అందరికి అర్థమయ్యే పరిస్థితి.
కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాల మీద తీవ్ర అభ్యంతరం చెబుతూ.. నిరసన చేస్తున్న రైతుల మీదకు రెండు ఎస్ యూవీ వాహనాల్ని ఎక్కించటం ద్వారా నలుగురురైతుల మరణానికి కారణం కావటం పెను సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. సదరు కేంద్రమంత్రిదిగా చెబుతున్న పాత వీడియో ఒకటి పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఇది ఆయన్ను మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది.
ఇంతకూ ఆ వీడియోలో ఏముందన్న విషయానికి వెళితే.. ఆయన రైతులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా ఉంది. రైతుల్ని క్రమశిక్షణలో పెట్టటానికి తనకు రెండు నిమిషాల సమయం సరిపోతుందన్న అతను.. ‘నాతో తలపడండి. కేవలం రెండు నిమిషాల్లో మిమ్మల్ని దారికి తెస్తా.
నేను మంత్రినో.. ఎంపీనో.. ఎమ్మెల్యేనో మాత్రమే కాదు.. అంతకు ముందు నుంచి నేనెవరో ప్రజలకు తెలుసు’ అంటూ వచ్చిన బలుపు మాటలు వింటే.. మరీ ఇంతనా? అని ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఇప్పటికే జరిగిన ఉదంతంలో కిందా మీదా పడుతున్న యోగి సర్కారుకు.. కేంద్ర మంత్రి వారి పాత వీడియో మరింత ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. మరి.. ఈ రెండు నిమిషాల ఆరాచకనేతపై మోడీషాలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.