యోగి దెబ్బ‌కు నేర‌స్తులే స్టేష‌న్ల‌కు వ‌చ్చేస్తున్నారు

Update: 2018-02-17 10:52 GMT
నేరం చేసిన నేర‌స్తులు పోలీస్ స్టేష‌న్ల‌కు వ‌చ్చి లొంగిపోవ‌టం ఉంటుందా?  కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో నేరాల‌కు పాల్ప‌డే వారు.. తాము నేరం చేశామ‌ని చెబుతూ లొంగిపోవ‌టం మామూలే. కానీ.. క‌ర‌డుగ‌ట్టిన నేర‌స్తులు తాము గ‌తంలో చేసిన నేరాల గురించి పోలీస్ స్టేష‌న్ల‌కు వ‌చ్చి.. పూస‌గుచ్చిన‌ట్లు చెప్ప‌టం.. చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర‌టం సాధ్య‌మేనా? అంటే.. నో అంటే నో అనేస్తారు.

ఇలాంటివి సినిమాల్లో సాధ్య‌మే త‌ప్పించి రియ‌ల్ లైఫ్ లో సాధ్య‌మే కాద‌ని చెబుతారు. కానీ.. నేరాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా.. కొమ్ములు తిరిగిన నేర‌గాళ్ల‌కు అడ్డాగా ఉండే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌స్తుతం ఇలాంటి ప‌రిస్థితి ఉంద‌ని చెబుతున్నారు. ఎందుకిలా అంటే.. దీనికో ప్రత్యేక కార‌ణం లేక‌పోలేదు.  యూపీ సీఎంగా యోగి ప‌గ్గాలు చేపట్టిన నాటి నుంచి 1200 ఎన్ కౌంట‌ర్లు చోటు చేసుకున్నాయి. వామ్మో.. ఇన్ని ఎన్ కౌంట‌ర్లా? అన్న డౌట్ అక్క‌ర్లేదు.

ఎందుకంటే.. ఈ గ‌ణాంకాల్ని యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ స్వ‌యంగా అసెంబ్లీలో చెప్పారు మ‌రి. ఇన్నేసి ఎన్ కౌంట‌ర్లు ఎలా చేస్తారంటూ విప‌క్షాలు మండిప‌డినా.. యోగి మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. నేరాల‌ను అదుపులో పెట్ట‌టానికి నేర‌స్తుల‌కు అర్థ‌మ‌య్యే భాష‌లోనే స‌మాధానం చెబుతామ‌ని చెప్పి మ‌రీ.. ఎడాపెడా ఎన్ కౌంట‌ర్లకు ఓకే చెప్పేశారు. దీంతో.. పోలీసులు త‌మ ప‌వ‌ర్ ఏంటో చూపించారు. నేర‌స్థుల ప‌ట్ల సానుభూతి చూపిస్తే ప్ర‌జాస్వామ్యానికి ముప్పు అని చెప్ప‌ట‌మే కాదు.. పోలీసుల‌కు ప‌రిమితులు విధించ‌కుండా ఉండ‌టంతో యూపీలో లెక్క‌లు మారిపోయాయి.

క‌రుడుగ‌ట్టిన నేర‌స్థులు సైతం ఇప్పుడు పోలీస్ స్టేష‌న్ కు వ‌స్తున్నారు. గ‌తంలో తాము చేసిన నేరాల్ని పోలీసుల‌కు చెప్పి.. త‌ప్పు ఒప్పేసుకుంటున్నారు. ఇక‌పై.. త‌ప్పులు చేయ‌మంటూ చెంప‌లు వేసుకుంటున్నారు. ఎంత నేర‌స్థులైనా ఎవ‌రికి వారికి వారి.. వారి ప్రాణాలంటే తీపే క‌దా?

ఇప్పుడు పోలీస్ స్టేష‌న్ల‌కు వ‌స్తున్న నేర‌స్థులు.. ఇక‌పై తాము త‌ప్పులు చేయ‌మ‌ని.. క్ష‌మించి ఒగ్గేయ‌మ‌ని కోరుకుంటున్నారు. కాదూ.. కుద‌ర‌దంటే చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటే అనుభ‌విస్తామ‌ని ప్రాధేయ‌ప‌డుతున్నార‌ట‌. త‌మ‌ను వ‌దిలేస్తే మ‌ళ్లీ నేరాల జోలికి వెళ్ల‌మ‌ని చెబుతూ.. త‌మ‌కూ పిల్లా పాప‌లు.. కుటుంబాలు ఉన్నాయ‌ని.. వాటిని చూసుకోవాలి క‌దా అని సెల‌విస్తున్నారు.

 ఇలాంటి నేప‌థ్యంలో యూపీ పోలీసులు త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో ఆస‌క్తిక‌ర పోస్టు ఒక‌టి పెట్టారు. ఇందులో ఇటీవ‌ల కాలంలో పోలీస్ స్టేష‌న్ల‌కు వ‌చ్చి లొంగిపోయిన నేర‌స్థుల ఫోటోల్ని పెట్టి.. పోలీసుల‌కు కాదు.. నేరాల‌కు భ‌య‌ప‌డుతున్నారన్న వ్యాఖ్య‌ను పోస్ట్ చేశారు. కాస్త ఘాటుగా ఉన్న ఈ వ్యాఖ్య యూపీ పోలీసుల సొంతం కాదు.. సూప‌ర్ హిట్ అయిన ద‌బాంగ్ సినిమాలో ఫేమ‌స్ డైలాగ్‌. మొత్తానికి ద‌బాంగ్ స్టైల్లో నేర‌స్థుల తాట తీస్తున్న యూపీ పోలీసుల ఇప్పుడు మాంచి ఉత్సాహంగా ఉన్నారు.


Tags:    

Similar News