ఈ 'వ్య‌తిరేక‌త'కు కార‌ణం క‌నిపెట్టారా... వైసీపీలో వేదన...!

Update: 2022-05-30 17:30 GMT
ఔను.. ఇటీవ‌ల కాలంలో వైసీపీకి వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి వ్య‌తిర‌కంగా .. ప్ర‌జ‌లు గ‌ళం విప్పుతున్నార‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి ఈ విష‌యంలో ప్ర‌భుత్వం చెబుతున్న మాట‌.. ఏంటంటే.. తాము ల‌క్ష‌ల క‌కోట్ల రూపాయ‌లు అప్పులు చేసి మ‌రీ.. ప్ర‌జ‌ల‌కు సంక్షేమంఅమ‌లు చేస్తున్నాం. కాబ‌ట్టి.. అస‌లు వ్య‌తిరేక‌త ఎక్క‌డ ఉంటుంది? అని! అయితే.. దీనికి భిన్నంగా గ‌డ‌ప‌.. గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని తీసుకుంటే.. ప్ర‌జ‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సామాజిక న్యాయ భేరి కార్య‌క్ర‌మాన్ని తీసుకున్నా.. ప్ర‌జ‌లు రావడం లేద‌ని.. ఖాళీ కుర్చీల‌కే మంత్రులు ప్ర‌సంగాలు చెప్పి వెళ్లిపోతున్నార‌ని.. పెద్ద ఎత్తున క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇవి వాస్త‌వాలు కూడా! వీటిని వైసీపీ నాయ‌కులు.. ముఖ్య నేత‌లు సైతం అంగీక‌రిస్తున్నారు. అనుకూల మీడియాలోనూ.. వీటిని దాచ‌లేక పోతున్నారు. దీంతో అస‌లు ఏం జ‌రుగుతోంది?  క్షేత్ర‌స్థాయిలో ఎందుకు ఇలా ఉంది?  అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

వీటిపైనే స‌ర్కారు పెద్ద స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స‌హా.. ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు వంటివారు మేధో మ‌థ‌నం చేశారు. ఆయా జిల్లాల నుంచి అనుకూల వ‌ర్గాల‌తో రిపోర్టులు తెప్పించుకున్నారట‌. వీటిలో కొన్ని సంచ‌ల‌న వాస్త‌వాలు వెలుగు చూశాయి.

సొంత పార్టీ నాయ‌కులే కార్య‌క్ర‌మాల‌కు గండి కొడుతున్నార‌ని.. తెలిసింద‌ని.. పార్టీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఉదాహ‌ర‌ణ‌కు రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన స‌భ‌కు జ‌నం వ‌చ్చారు. కానీ, మంత్రులు స‌భ‌కు వ‌చ్చే స‌రికి వెళ్లిపోయారు.

దీనికి కార‌ణం .. ఒక అస‌మ్మ‌తి నాయ‌కుడేన‌ని తెలిసింది. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు వాట్సాప్ సందేశాలు పంపించి.. "కార్య‌క్ర‌మానికి మంత్రులు రావ‌డం ఇంకా లేట‌వుతుంది.. వ‌చ్చాక సందేశం పంపిస్తాం.. అప్పుడు రావ‌లి!" అని సూచించార‌ట‌. దీంతో జ‌నాలు వెళ్లిపోయారు. తీరా మంత్రులు వ‌చ్చాక‌.. ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా రాలేదు. ఇక‌, విజ‌య‌వాడ బెంజి స‌ర్కిల్‌లో అయితే.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉన్న ఓ కీల‌క అధికారి నిర్వాకంతో ఇక్క‌డ స‌భ‌కు వ‌చ్చిన జ‌నం వెన‌క్కి వెళ్లిపోయార‌ట‌.

అదేవిధంగా ఇత‌ర జిల్లాల్లోనూ.. సొంత పార్టీలోని అస‌మ్మ‌తి వ‌ర్గం.. ప్ర‌జ‌ల ను రెచ్చగొట్టి ప్ర‌శ్నించేలా చేస్తోంద‌ని.. నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ట‌. దీంతో వీరిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేలా స‌జ్జ‌ల‌, ఉమ్మారెడ్డి బృందం సీఎంకు సిఫార‌సులు చేసిన‌ట్టు స‌మాచారం.
Tags:    

Similar News