టీ20 వరల్డ్ కప్: పాక్ సెమీస్ చేరాలంటే భారత్, సౌతాఫ్రికా ఓడాలి.. పాక్ బెగ్గింగ్ షురూ

Update: 2022-11-04 05:32 GMT
టీ20 వరల్డ్ కప్ ను పాకిస్తాన్ రసవత్తరంగా మార్చేసింది. నిన్న బలమైన సౌతాఫ్రికాను ఓడించిన పాక్ గ్రూప్ 2 సెమీఫైనల్ సమీకరణాలను మార్చేసింది. కేవలం రెండు టీంలు మాత్రమే వెళ్లే సెమీస్ రేసులోకి పాకిస్తాన్ వచ్చి చేరింది. తద్వారా భారత్, సౌతాఫ్రికాలు ఇప్పుడు డేంజర్ జోన్ లో పడ్డాయి.

టీ20 వరల్డ్ కప్ లో ఇంకా 6 మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒక్క జట్టు కూడా ఇప్పటివరకూ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోలేదు. గ్రూప్ 1తోపాటు గ్రూప్ 2లోనూ సెమీస్ బర్త్ కోసం మూడు జట్ల చొప్పున 6 జట్లు పోటీపడుతున్నాయి. ఆయా జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

టోర్నీలో పాల్గొన్న ప్రతీ జట్టు ఒక మ్యాచ్ లో ఓడిపోయింది. ఏ జట్టు కూడా అజేయంగా నాకౌట్ కు వెళ్లలేదు. గురువారం సౌతాఫ్రికాను భారీ తేడాతో పాకిస్తాన్ ఓడించడంతో అనూహ్యంగా సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది. ఈ విజయంతో సౌతాఫ్రికా డేంజర్ జోన్ లో పడింది. మరోవైపు భారత్ ఇప్పుడు తన చివరి మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గ్రూపు2లో టీమిండియా 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. సౌతాఫ్రికా 5 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. పాకిస్తాన్ 4 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక బంగ్లాదేశ్ కూడా 4 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. జింబాబ్వే 3 పాయిట్లు, నెదర్లాండ్ 2 పాయింట్లతో సెమీస్ రేసు నుంచి వైదొలిగాయి.

పాకిస్తాన్ తన చివరి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో తలపడుతుంది. ఈ రెండింటిలో ఏది గెలిస్తే దానికి సెమీస్ అవకాశాలు ఉంటాయి. కానీ బలమైన పాకిస్తాన్ ను ఓడించడం బంగ్లాదేశ్ వల్ల కాదు. ఎవరు గెలిచినా రెండూ 6 పాయింట్లకు చేరుకొని సెమీస్ రేసులో రెండో జట్టుగా వెళ్లే అవకాశ ఉంటుంది. రన్ రేట్ ను బాగా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది.

ఇక పాక్ కానీ బంగ్లాదేశ్ కానీ సెమీస్ చేరాలంటే తప్పనిసరిగా చివరి మ్యాచ్ లో నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవాలి. వర్షం వల్ల రద్దు అయినా కూడా పాకిస్తాన్ సెమీస్ చేరడం ఈజీ అవుతుంది. సౌతాఫ్రికా ఇంటిదారి పడుతుంది. ఎందుకంటే సౌతాఫ్రికా నెట్ రన్ రేట్ కంటే పాకిస్తాన్ రన్ రేట్ మెరుగ్గా ఉండడం ఆ జట్టు సెమీస్ అవకాశాలను పెంచింది.

ఇక జింబాబ్వే చేతిలో భారత్ ఓడినా కూడా పాకిస్తాన్ కు సెమీస్ బెర్త్ దక్కుతుంది. భారత్ కంటే కూడా పాకిస్తాన్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. సౌతాఫ్రికా గెలిస్తే భారత్ ను ఇంటికి పంపి ఆ జట్టు సెమీస్ లోకి వెళుతుంది.

-బంగ్లాదేశ్ సెమీస్ చేరాలంటే చివరి మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఓడించాలి. అదే సమయంలో చివరి మ్యాచ్ లలో భారత్, సౌతాఫ్రికాల్లో ఏ జట్టు అయినా ఓడిపోవాలి. ఇలా అయితేనే బంగ్లాదేశ్ సెమీస్ వెళుతుంది..

-టీమిండియా సెమీస చేరాలంటే తన చివరి మ్యాచ్ లో జింబాబ్వేను ఓడిస్తే చాలు. 8 పాయింట్లతో గ్రూపులో అగ్రస్థానంతో సెమీస్ చేరుతుంది. ఓడితే మాత్రం రన్ రేట్ ఆధారంగా సౌతాఫ్రికా, పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉంటేనే సెమీస్ చేరుతుంది. లేదంటే ఇంటిదారి పడుతుంది.

ఎలా చూసినా గ్రూప్ 1లో సెమీస్ రేసులో ఇప్పుడు టీమిండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికాలు బలంగా పోరాడుతున్నాయి. చివరి మ్యాచ్ వరకూ సెమీస్ రేసు తేలే అవకాశాలు కనిపించడం లేదు. గ్రూప్ 1లోనూ ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.

-పాకిస్తాన్ బెగ్గింగ్..

పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే బంగ్లాదేశ్ పై గెలవడంతోపాటు భారత్, సౌతాఫ్రికాల్లో ఏదైనా ఒక జట్టు తన చివరి మ్యాచ్ లో ఓడిపోవాలి. అందుకే ఇప్పుడు పాకిస్తానీలు అంతా భారత్ ను జింబాబ్వే ఓడించాలని.. సౌతాఫ్రికాను నెదర్లాండ్ ను ఓడించాలని పూజలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. దీన్ని చూసి ఇదేం బెగ్గింగ్ అంటూ అందరూ ఆడిపోసుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News