అస‌లు ఉత్త‌రాంధ్ర‌కు కావాల్సిందేంటి... వాస్త‌వం ఇదీ..!

Update: 2022-10-16 02:30 GMT
వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌వ‌చిస్తున్న మూడు రాజ‌ధానుల విష‌యం ప‌రాకాష్ట‌కు చేరుకుంది. ఉత్త‌రాంధ్ర‌కు జీవ‌నాడి వంటి.. మూడు జిల్లాల్లోని కీల‌క‌మైన విశాఖ‌లో పాల‌నా రాజ‌ధాని ఏర్పాటు చేయ‌డం ద్వారా.. అభివృద్ధి వికేంద్రీకర‌ణ జ‌రుగుతుంద‌ని వైసీపీ చెబుతోంది. అయితే.. ఇది ఏమేర‌కు సాధ్యం? అనేదే ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఎందుకంటే.. రాజ‌ధాని ఏర్పాటుతోనే న‌గ‌రాలు అభివృద్ధి చెందుతాయా?  దీనికి ఒక కొల‌మానం ఉందా?  లేదా? అనే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది.

అదేస‌మ‌యంలో ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాలు.. విశాఖ‌,శ్రీకాకుళం, విజ‌య‌నగ‌రం జిల్లాల‌ను చూస్తే.. ఏ జిల్లాకు ఆ జిల్లా భౌగోళికంగా.. వార‌స‌త్వ ప‌రంగా.. ప్ర‌జ‌ల ప‌రంగా కూడా.. భిన్న‌మైన వ్య‌త్యాసం ఉంది. ఇక‌, స‌మ‌స్య‌ల ప‌రంగా చెప్ప‌న‌క్క‌ర లేదు. విజ‌య‌న‌గ‌రంలో ఉన్న ప‌రిస్థితులు.. శ్రీకాకుళంలో లేవు. ఇక్క డున్న‌వి విశాఖ‌లో లేవు. ఈ రెండు జిల్లాల్లో ఉన్న ప‌రిస్థితి విశాఖ‌కు భిన్నంగా ఉంటుంది. సో.. విశాఖ‌లో్ రాజ‌ధాని ఏర్పాటు చేసినంత మాత్రాన స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని చెప్ప‌డానికి ఇత‌మిత్థంగా ప్రాతిప‌దిక లేదు.

ఉదాహ‌ర‌ణ‌కు దేశ రాజ‌ధాని ఢిల్లీ తీసుకుంటే.. ఇది మెట్రోపాలిటిన్ న‌గ‌రం. అలాగ‌ని.. ఢిల్లీ మొత్తం అభివృద్ధి చెందిందా...?  మురికి వాడ‌లు లేవా? అంటే.. ఉన్నాయి. ఢిల్లీని ఆనుకుని.. అభివృద్ధి చెందిన ప్రాంతం కేవ‌లం 10 కిలో మీట‌ర్ల లోపే. త‌ర్వాత‌..  అంతా.. లోత‌ట్టు ప్రాంతాలు.. మురికి వాడ‌లే. ఇక‌, మ‌న తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌ను తీసుకుంటే..ఇది కూడా అంతే.. హైద‌రాబాదే.. ఇప్ప‌టికీ.. చిన్న వ‌ర్షానికి .. నీట మునుగుతోంది.పైగా.. హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల అభివృద్ధి చెంద‌లేదు.

అంటే.. ఒక రాజ‌ధాని ఏర్ప‌డ‌డంతోనే.. ఆ జిల్లా రూపు రేఖ‌లు మారిపోతాయ‌ని.. కానీ, లేదా.. పొరుగున ఉన్న జిల్లాల్లో ఏదో పెనుమార్పులు వ‌స్తాయ‌ని కానీ చెప్ప‌లేం. దీనికి కావాల్సింది.. పాల‌కుల చిత్త శుద్ధి.  

ఢిల్లీకి క‌డుదూరంలో ఉన్న ఆగ్రా(యూపీ) మెట్రోపాలిట‌న్ సిటీ కాదు. కానీ, ఇది ఆదాయ వ‌న‌రుగా మారి.. అద్భుత న‌గ‌రంగా.. రికార్డుల‌కు ఎక్కింది. అంతేకాదు.. ఎంత  భారీ వ‌ర్షం కురిసినా..చుక్క‌నీరు నిల‌వ‌కుండా..య‌మునా న‌దిలోకి వెళ్లిపోయేలా.. ర‌హ‌దారుల‌ను ప్లాన్ చేశారు. కార‌ణం.. తాజ్‌మ‌హ‌ల్ ఉండ‌డ‌మే. అంటే.. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే.. ఇలాంటి.. ఒకటి రెండు ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే.. వెనుదిరిగి చూడాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ది నిపుణుల మాట‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News