ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైసీపీకి పార్టీకి మరో ఎదురుదెబ్బ ఖాయమైంది. ఆ పార్టీ కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వైసీపీ వీడ్కోలు పలుకనున్నారు. ఈ నెల 25న సీఎం చంద్రబాబు సమక్షంలో కల్పన టీడీపీలో చేరుతున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో కల్పన చర్చలు జరిపారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో వివరించిన కళా వైసీపీ ఎమ్మెల్యే చేరిక విషయమై అనుమతి తీసుకున్నారని సమాచారం.
కొంతకాలంగా కల్పన వైసీపీ వీడుతారని ప్రచారం జరుగగా, తాజాగా కళా వెంట్రావుతో భేటీ కావడంతో ఆ ఊహాగానాలపై క్లారిటీ వచ్చేసింది. ఇదిలాఉండగా ఇప్పటికే 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరగా ఉప్పులేటి కల్పనతో ఆ సంఖ్య 21 కానుంది. ఉప్పులేటి కల్పన రాకను పార్టీ ప్రధాన కార్యదర్శి, గత ఎన్నికల్లో ఆమె చేతిలో ఓడిపోయిన టీడీపీ నేత వర్ల రామయ్య అడ్డుకుంటుండగా చంద్రబాబు కలుగజేసుకొని ఆయనకు సర్ది చెప్పినట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/