బాలీవుడ్ రంగీలా.. సీనియర్ నటి ఉర్మిలా మటోండ్కర్ సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయాల బాటపట్టారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంటికివెళ్లి మరీ కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో సీటు విషయమై చర్చించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఉర్మిళా కేంద్రంలోని బీజేపీపై హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దేశంలో భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛలేదని.. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు స్వేచ్ఛ కోసం పోరాడుతోందని.. ఆ సిద్ధాంతాలు నచ్చే తాను కాంగ్రెస్ పార్టీలో చేరారనని తెలిపారు.
కాగా ఉర్మిళను ముంబై ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ నిర్ణయించినట్టు సమాచారం. ఈ నియోజకవర్గం బీజేపీకి గట్టి పట్టు ఉంది. 1989-2004 వరకు బీజేపీ నేత రామ్ నాయక్ ఇక్కడ ఎంపీగా గెలుస్తూ వచ్చారు. 2004లో సైతం కాంగ్రెస్ అభ్యర్థి స్టార్ హీరో గోవిందాను రామ్ నాయక్ ఓడించాడు. ఇక 2014 ఎన్నికల్లో బీజేపీ నేత గోపాల్ షెట్టి గెలిచారు. ఇప్పుడు ఆయనపై కాంగ్రెస్ ఉర్మిళను బరిలోకి దించుతోంది. ఇక్కడ నటులు, స్టార్ హీరోల ప్రభాల్యం అధికంగా ఉంటుంది. బాలీవుడ్ జనాలకు పెట్టింది పేరు. అందుకే బీజేపీకి పోటీగా సినీ నేపథ్యమున్న ఉర్మిళను కాంగ్రెస్ ప్రయోగిస్తోంది. ఉర్మిళా బాలీవుడ్ - టాలీవుడ్ సహా పలు ప్రముఖ చిత్రాల్లో నటించి పేరు సంపాదించుకొంది.