భారతదేశం సుదీర్ఘ కాల డిమాండ్ నెరవేర్చేందుకు అగ్రరాజ్యం అమెరికా ఓకే చెప్పింది. అయితే తనదైన శైలిలోనే ట్విస్ట్ ఇస్తూ....ఓ షరతు పెట్టింది. ఇదంతా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం గురించి. యూఎన్ ఓలో సభ్యత్వం కావాలని భారత్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. యూఎన్ కు అమెరికా రాయబారిగా ఉన్న నిక్కీ హేలీ ఆ అంశంపై స్పందించారు. ``ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలకు అమెరికా సిద్ధంగా ఉంది. కానీ భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కావాలంటే.. వీటో అధికారాల గురించి ఆ దేశం ఆలోచించ రాదు`` అని నిక్కీ హేలీ తేల్చిచెప్పారు. భద్రతా మండలిలో ప్రస్తుతం ఉన్న అయిదుగురు సభ్యదేశాలు వీటో అంశంపై వెనక్కి తగ్గేందుకు ఆసక్తిగా లేరన్న అంశాన్ని నిక్కీ హేలీ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా దక్షిణాసియా దేశాల పట్ల ప్రెసిడెంట్ ట్రంప్ కు ఉన్న అభిప్రాయాలను కూడా ఆమె వినిపించారు. పాకిస్థాన్ పట్ల అమెరికా గట్టి నిఘా పెట్టిందని హేలీ తెలిపారు. ఉగ్రవాదులకు సురక్షిత ప్రాంతంగా మారిన పాకిస్థాన్ ను ఏమాత్రం సహించేది లేదని ఆమె తెలిపారు. తద్వారా పాకిస్తాన్ కు అమెరికా దగ్గరవుతోందనే భావనకు చెక్ పెట్టారు. ఆఫ్ఘనిస్తాన్ కు మరింత సాయం చేయాలని ఈ సందర్భంగా భారత్ ను ఆమె మరోసారి కోరారు. యూఎస్ - ఇండియా ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ సభ్యులను కలిసిన నిక్కీ హేలీ ఈ విషయాలను వెల్లడించారు. వీటోను వద్దనుకుంటేనే.. భారత్ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం వచ్చే అవకాశాలు ఉన్నట్లు హేలీ తెలిపారు.
కాగా, అంతర్జాతీయ సంబంధాల విషయంలో ప్రభావం చూపే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యత్వం భారత్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. భద్రతా మండలిలో అమెరికా - బ్రిటన్ - ఫ్రాన్స్ - రష్యా - చైనా దేశాలు శాశ్వత సభ్యులుగా ఉన్నాయి. అయితే ఈ దేశాలు ఇప్పుడు వీటోను మరికొన్ని దేశాలకు విస్తరించేందుకు అనుకూలంగా లేవు. యూఎన్ లో పర్మనెంట్ సభ్యత్వం కావాలని భారత్ డిమాండ్ చేస్తోంది. దాని కోసం సంస్కరణలు చేపట్టాలని కొన్ని దేశాలు కోరుతున్నాయి. అయితే జీ4 దేశాలైన జర్మనీ - జపాన్ - బ్రెజిల్ కూడా ఈ అంశంలో భారత్ కు అండంగా నిలుస్తున్నాయి. బ్రిక్స్ దేశాలు కూడా భారత్ కు జైకొడుతున్నాయి. కానీ భారత్ కు వీటో అధికారం ఇవ్వాలన్న అంశాన్ని రష్యా - చైనా దేశాలు అడ్డుకుంటున్నట్లు తాజాగా నిక్కీ హేలీ వెల్లడించారు. మరోవైపు బ్రిటన్.. వీటో అధికారాలను మరికొన్ని దేశాలకు విస్తరించడాన్ని వ్యతిరేకిస్తోంది. ఒక్క ఫ్రాన్స్ మాత్రమే వీటోను విస్తరించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. 21వ శతాబ్ధపు వాస్తవాలకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి వ్యవహరించడం లేదని చాలా వరకు సభ్య దేశాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.