15వేల అద‌న‌పు వీసాల‌కు అమెరికా ప‌చ్చ‌జెండా

Update: 2018-05-29 06:22 GMT
లోక‌ల్ కు పెద్ద‌పీట అంటూ తెగ మాట‌లు చెప్పేయ‌ట‌మే కాదు.. చేత‌ల్లోనూ చేసి చూపించిన ట్రంప్ కార‌ణంగా అమెరికా ఆశ‌లు ఎంతోమందికి ఆడియాశ‌ల‌య్యాయి. గ‌తంలో మాదిరి కాకుండా వీసాల జారీ విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ట్రంప్ స‌ర్కారు పుణ్య‌మా అని.. ప‌లువురు అమెరికా ఆశ‌ల్ని వ‌దిలేసుకున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ట్రంప్ స‌ర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు జారీ చేయాల్సిన వీసాల‌కు అద‌నంగా మ‌రో 15వేల వీసాల్ని తాజాగా జారీ చేస్తామ‌ని చెప్పింది.

2018లో జారీ చేసే వీసాల‌కు తాజాగా ప్ర‌క‌టించిన 15వేల వీసాలు అద‌నంగా చెప్పాలి. హెచ్ -2 పేరుతో జారీ చేసే ఈ వీసాలు వ్య‌వ‌సాయేత‌ర రంగాల‌కు సంబంధించిన ఉద్యోగాల కోసం జారీ చేయ‌నున్నారు. తాత్కాలికంగా జారీ చేసే ఈ వీసాల కాల‌ప‌రిమితి ఉంటుంది. అమెరిక‌న్ వ్యాపారుల్ని సంతృప్తి ప‌ర్చే ప‌నిలో భాగంగా తాజాగా ట్రంప్ స‌ర్కారు ఈ ప‌దిహేను వేల వీసాల జారీకి ఓకే చెప్పిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

వ్య‌వ‌సాయేత‌ర రంగాల్లో ప‌ని చేసేందుకు అవ‌స‌ర‌మైన ఉద్యోగులు లేర‌ని.. వారి కొర‌త నేప‌థ్యంలో విదేశాల నుంచి నిపుణుల‌ను దేశానికి తీసుకొచ్చేందుకు వీలుగా తాజా వీసా జారీకి ఓకే చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ ఏడాది మొద‌ట్లో హెచ్-2 వీసాల కింద మొత్తంగా 66వేల వీసాలు జారీ చేయాల‌ని నిర్ణ‌యించారు. తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో ఈ సంఖ్య మ‌రో 15వేల‌కు పెరిగిన‌ట్లుగా చెప్పాలి. ఈ వీసా జారీకి అర్హ‌త క‌లిగిన వారు ఈ వారం నుంచే అప్లికేష‌న్లు పెట్టుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. వ్యాపారుల మాట‌ల‌కు అమెరికా ఎంత విలువ‌నిస్తుందో ఇట్టే తెలుస్తుంది.
Tags:    

Similar News