కరోనా: భారత్ కు అమెరికా భారీ సాయం

Update: 2020-03-28 05:33 GMT
కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతున్న అమెరికా తన ఇళ్లు చక్కదిద్దుకునే ప్రయత్నం మాత్రం చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ తాజాగా అమెరికా కరోనాపై యుద్ధం ప్రకటించింది. కరోనాను ఎదుర్కొనేందుకు ఏకంగా 64దేశాలకు 174 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించి సంచలనం సృష్టించింది.

భారత దేశానికి కూడా అమెరికా 2.9 మిలియన్ డాలర్ల సహాయం అందజేయనుంది. ఇది గత ఫిబ్రవరిలో ప్రకటించిన 100 బిలియన్ డాలర్ల సాయానికి అదనం కావడం విశేషం.

ప్రపంచంలో 64 దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ దేశాల్లో తగినన్ని వైద్య సాధనాలు, నిపుణులు లేక మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి.  ఈ నేపథ్యంలోనే అమెరికా సాయంతో లేబొరేటరీ, ఇతర వైద్య పరికరాలను కొనుగోలు చేయాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది.

కరోనాపై యాక్షన్ ప్లాన్ ను అమెరికా రూపొందించిందని..  ప్రపంచానికి పెద్దన్నలా అమెరికా ఈ సాయాన్ని ప్రకటించిందని అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ ప్రకటించింది.

భారత్ కే కాదు.. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ కు అమెరికా సాయం ప్రకటించింది.

అమెరికాలో కరోనా మరణాలు, పాజిటివ్ కేసులు పెరుగుతున్నా పట్టించుకోకుండా ఇతర దేశాలకు భారీ ఆర్థిక సాయం ప్రకటిస్తున్న అమెరికా తీరుపై ఆ దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుతున్నాయి.
Tags:    

Similar News