ఉగ్ర మూకల సమాచారమిస్తే భారీ నజరానా: యూఎస్

Update: 2018-11-26 09:13 GMT
భారత ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో 26/11 దాడులు జరిగిన పదేళ్లు పూర్తయ్యాయి.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ - హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మృతులకు నివాళులర్పించారు. అప్పటి ఈ ఘటన యావత్ దేశంతో పాటు ప్రపంచం మొత్తాన్ని వణుకు పుట్టించింది. ఇలాంటి దాడులు ఎక్కడైనా జరగవచ్చనే అనుమానంతో ప్రపంచ దేశాలు భద్రతను కట్టుదిట్టం చేసుకున్నాయి.

కాగా, ముంబై మారణ హోమంపై యూఎస్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. 166 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్ర మూకల సమాచారన్ని ఇచ్చిన వారికి 5 మిలియన్‌ డాలర్లు(దాదాపు 35 కోట్ల రూపాయలు) ఇస్తానని ప్రకటించింది. యూఎస్ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పొంపియో మాట్లాడుతూ ఉగ్రచర్యకు నిరసన తెలియజేస్తున్నామని అన్నారు. అమెరికా ప్రభుత్వం తరుపున భారత ప్రజలు - ముంబై వాసులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

ప్రపంచం మొత్తాన్ని షాక్‌కు గురిచేసిన  ఈ సంఘటనకు సంబంధించి  సూత్రధారులను ఇప్పటి వరకు పట్టుకోకపోవడం బాధిత కుటుంబాలను అవమాన పరచడమేనని పొంపియో పేర్కొన్నారు.  ఈ దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదుల్లో ఒకడైన కసబ్‌ ను సజీవంగా పట్టుకోవడానికి పోలీసులు ప్రాణ త్యాగం చేయాల్సి వచ్చిందని అన్నారు. లష్కరే తోయిబాతో సహా అనుబంధ సంస్థలపై నిషేధం విధించాలని ఐకరాజ్యసమితి భద్రత మండలి తరఫున ప్రపంచ దేశాలకు  పిలుపునిచ్చారు. ముంబై దాడుల కారకులను న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి అమెరికా కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. కాగా, అమెరికా ఇలాంటి రివార్డు ప్రకటించడం ఇది మూడోసారి.
   

Tags:    

Similar News