కరోనా: 1946 తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం.. పర్యావసనాలివీ

Update: 2020-04-04 06:15 GMT
కరోనా వైరస్ ధాటికి అమెరికా కుప్ప కూలుతోంది. ఇప్పటివకే కరోనా మరణాలు సంఖ్య 7వేలు దాటింది. బాధితుల సంఖ్య 3 లక్షలు దాటుతోంది. ప్రపంచపు పెద్దన్నగా.. అగ్రరాజ్యంగా ఎదిగిన అమెరికాకు కొన్ని దశాబ్ధాల్లో ఎన్నడూ చూడనంతగా అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనమవుతోందట..ఈ మేరకు మోర్గాన్ స్టాన్లీ నివేదిక సంచలన విషయం వెల్లడించింది.

అమెరికా ఆర్థిక వ్యవస్థ 1946లో అతలాకుతలమైంది. ఆ తర్వాత అప్పటి కంటే చాలా దారుణంగా ప్రస్తుతం పతనమవుతోందని మోర్గాన్ స్టాన్లీ సంచలన విషయాలు వెల్లడించింది. 2020లో అమెరికా ఎకానమీ 5.5 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. 1946 తర్వాత ఇదే మొదటిసారి. రెండో క్వార్టర్ లో 38శాతం మేర నష్ట పోతుందని శుక్రవారం నివేదిక  వెల్లడించింది.
 
కరోనా కారణంగా సర్వం బంద్ కావడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ త్రైమాసిక వృద్ధి రేటును 2.4 శాతం నుంచి 3.4శాతానికి యూఎస్ ఫెడరల్ బ్యాంకు పెంచింది. అయితే రెండో క్వార్టర్ లో 30శాతం కుచించుకు పోతుందని పేర్కొంది. ఇప్పుడు దానిని 38శాతానికి పెంచింది.

అమెరికా నిరుద్యోగం.. రెండో త్రైమాసికంలో రికార్డ్ స్థాయిలో 15.7శాతం ఉంటుందని ఆర్థిక వేత్తలు అంచనావేశారు. దీనిని 12.5శాతానికి తగ్గించారు. దీంతో ఏకంగా 21 మిలియన్ల ఉద్యోగాల కోత ఉంటుందని దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇక అమెరికా వృద్ధి రేటు గతంలో ఎప్పుడూ లేనంతగా కుప్పకూలడం ఖాయమంటున్నారు. రెండో త్రైమాసికంగా అమెరికా స్తూల జాతీయోత్పత్తి 7శాతం కంటే తగ్గుతుందని అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం విడుదల చేసిన అంచనాలు వెల్లడించాయి.
Tags:    

Similar News