ప్రపంచంలో ఎక్కడేం జరిగినా.. పెద్దన్న పాత్ర పోషించేందుకు సిద్దమయ్యే అమెరికా.. తన పెద్దరికపు హోదాను నిలుపుకునేందుకు ఎంతకైనా రెఢీ అవుతుందన్న విషయాన్ని చెప్పే ఉదంతమిది. ఉగ్రవాదం కావొచ్చు.. మరొకటి కావొచ్చు.. తన ప్రత్యర్థుల పీచమణచటానికి అగ్రరాజ్యం ఎంత కరకుగా వ్యవహరిస్తుందో చెప్పే గణాంకాలు తాజాగా వెల్లడయ్యాయి.
సిరియాలో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఐసిస్ ముష్కరుల మీద యుద్ధం ప్రారంభించిన సంగతి తెలిసిందే. గడిచిన మూడేళ్లుగా ఐసిస్ రాక్షసుల మీద యుద్ధం చేస్తున్న అమెరికా.. ఇప్పటివరకూ ఎంతమందిని హతమార్చిందో తెలిస్తే అవాక్కు అవ్వాల్సింది. ఐసిస్ మీద పోరులో భాగంగా గడిచిన మూడేళ్లలో సిరియాలో ఎంతమందిని హతమార్చిందో చెప్పింది బ్రిటన్ కు చెందిన ఒక సంస్థ. లండన్ కేంద్రంగా పని చేసే సిరియా మానవహక్కుల పరిశీలనా సంస్థ తాజాగా విడుదల చేసిన గణాంకాలు చూస్తే.. షాక్ కావాల్సిందే.
మూడేళ్ల వ్యవధిలో ఐసిస్ మీద పోరులో భాగంగా అమెరికా చేసిన దాడుల్లో మొత్తం 7631 మంది మరణించారు. మృతుల్లో 1256 మంది సాధారణ పౌరులు కాగా.. 275 మంది మైనర్లు.. 184 మంది మహిళలు ఉన్నారు.
అదే సమయంలో ఐసిస్ కు చెందిన సభ్యుల్ని ఇప్పటివరకూ 5961 మందిని హతమార్చింది. మరణించిన ఐసిస్ సభ్యుల్లో ఎక్కువమంది విదేశీయులే కావటం గమనార్హం. ఐసిస్ ను ఏరివేసే క్రమంలో అల్ కాయిదాకు గతంలో సాయంగా పని చేసిన సభాత్ ఫతే అల్ షమ్.. జైష్ అల్ సున్నా లాంటి చిన్న చిన్న ఉగ్రవాద సంస్థలకు చెందిన సభ్యుల్ని సైతం పెద్దన్న ఏసేసినట్లుగా తాజా నివేదిక పేర్కొంది. ఉగ్రవాదుల్ని చంపేసే క్రమంలో సాధారణ పౌరులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోవటం బాధను కలిగించే అంశంగా చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/