బాగ్దాదీని లేపేసే ఆపరేషన్ పేరు కైలా ముల్లర్ ఎందుకు?

Update: 2019-10-29 08:19 GMT
అనూహ్యంగా ఐసిస్ అధినేతను మట్టుపెట్టటం ద్వారా అమెరికా తనకున్న శక్తి సామర్థ్యాల్ని మరోసారి ప్రదర్శించింది. ఒక్కరంటే ఒక్క సైనికుడు గాయపడకుండానే.. బాగ్దాదీ లాంటి క్రూరుడ్ని లేపేసిన వైనానికి సంబంధించి చాలానే ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఈ సీక్రెట్ టాస్క్ కు ఆపరేషన్ కైలా ముల్లర్ అని పెట్టారు.

ఇంతకీ ఈ పేరు ఎందుకు పెట్టారంటే.. దీనికో విషాద నేపథ్యం ఉంది. లక్షలాది మంది మహిళల్ని సెక్స్ బానిసగా చేయటంతో పాటు.. తామెందుకు ఈ భూమి మీద పుట్టామన్న వేదన కలిగేలా హింసించే మనస్తత్వం బాగ్దాదీ సొంతం. మహిళల్ని మాత్రమే కాదు పిల్లల విషయంలోనూ నిర్దయగా వ్యవహరించేవాడు.

అలాంటి అతగాడు చేసిన లక్షలాది పాపాల్లో ఒక పాపం కైలా ముల్లర్. సిరియలో పని చేసే ఈ అమెరికా సామాజిక కార్యకర్తను బాగ్దాదీ కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెపైన అత్యంత క్రూరంగా అనేకమార్లు అత్యాచారం చేశాడు. ఆపై హత్య చేశాడు. ఎంతో వేదనకు గురి చేసి.. అతడి చేతుల్లో చనిపోయిన కైలా ముల్లర్ పేరును బాగ్దాదీని లేపేసే ఆపరేషన్ కు పేరుగా పెట్టారు.

తాను చేపట్టిన ఆపరేషన్ కు సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు పొక్కకుండా ఉండేలా చేయటంలో ట్రంప్ సక్సెస్ అయ్యేవారని చెప్పాలి. అంత పెద్ద ఆపరేషన్ జరుగుతున్నా.. వైట్ హౌస్ నుంచి బయటకు కించిత్ సమాచారం బయటకు పొక్కకుండా చేయటంలో విజయం సాధించారు. ఒకవైపు తన కమార్తె ఇవాంక వివాహ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనటం కోసం క్యాంప్ డేవిడ్ కు వెళ్లిన ట్రంప్.. ఆపై వర్జీనియాకు వెళ్లి మిలిటరీ ఆపరేషన్స్ కు సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. అనంతరం బేస్ బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. ఇలా చేస్తూనే మరోవైపు బాగ్దాదీకి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయటం విశేషం.


Tags:    

Similar News