గత కొంతకాలంగా హోరా హోరీగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముహూర్తం దగ్గరకొచ్చేసింది. రేపే (08-11-2016) అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ - రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ల భవితవ్యం తేల్చడానికి మొత్తం 12 కోట్ల మంది అమెరికన్లు సిద్దంగా ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 3.7 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా అమెరికా చరిత్రలో ఈ స్థాయిలో పోటీ రసవత్తరంగా ఎన్నడూలేదని పలువురు చెబుతున్న తరుణంలో... చివరి నిమిషం వరకూ ఫలితాన్ని నిర్ణయించే రాష్ట్రాల్లో ఇద్దరు అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నిన్న మొన్నటివరకూ సర్వేలు ఏమిచెప్పినా... ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ అంచనాలు - అవకాశాలు మారుతున్నాయని అంటున్నారు.
నవంబర్ 8న ఈస్ట్రన్ టైమ్ జోన్ లో ఉదయం 6 గంటలకు (భారత కాలమానం సాయంత్రం 5 గంటలు) ఎన్నికలు ప్రారంభమవుతాయి. 9న ఉదయం 6 గంటల (భారత కాలమానం) నుంచి ఎగ్జిట్ పోల్స్‌తో పాటు కౌంటింగ్ ప్రాంరభమవుతుంది. 10 గంటలకు ఫలితంపై ఒక అంచనా వస్తుంది. ఆరోజు మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వెల్లడి అవుతాయి. అయితే... డిసెంబర్ రెండో బుధవారం తర్వాత వచ్చే సోమవారం రోజున అధ్యక్ష - ఉపాధ్యక్షుల్ని ఎలక్టోరల్స్ ఎన్నుకుంటారు. విజేతను జనవరి 2, 2017న ప్రకటిస్తారు. జనవరి 20న అధికారికంగా ఎన్నికైన అభ్యర్థి దేశాధ్యక్ష బాధ్యతలు చేపడతారు. అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 8నే పూర్తయినప్పటికీ జనవరి 6 - 2017న ఉపాధ్యక్షుడు జో బిడెన్ ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల ఫలితం అధికారికంగా ప్రకటించాక ఎన్నిక ప్రక్రియ ముగుస్తుంది.
అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ సభ్యులు(435 మంది), సెనేట్ ప్రతినిధుల(100) సంఖ్య మొత్తం 535.. వాటి ఆధారంగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు నిర్ణయించారు. వీటికి తోడు డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా నుంచి ముగ్గురు ఎలక్టోరల్స్ కలవడంతో మొత్తం ఓట్లు 538 అవుతాయి. కాగా, ఒక రాష్ట్రంలో ఏ పార్టీ ఎక్కువ ఓట్లు సాధిస్తే మొత్తం ఎలక్టోరల్ సీట్లు ఆ పార్టీకి సొంతమవుతాయి. అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించాలంటే ఈ 538 ఓట్లలోనూ అభ్యర్థి తప్పకుండా 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సాధించాలి.
అమెరికాలో ఈ హడావిడి ఇలా ఉంటే... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చే అమెరికన్ ఓటర్లను చంపేస్తామని ఐసిస్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా నవంబరు 8న జరగబోయే ఈ ఎన్నికల్లో ముస్లింలు పాల్గొనరాదని ఐసిస్ సూచించింది. ఇస్లాం, ముస్లింల పట్ల వ్యవహరించే తీరులో రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య పెద్ద తేడాలు లేవని తెలిపింది. న్యూయార్క్ - వర్జీనియా - టెక్సాస్ లలో ఈ దాడులు జరిగే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/