ఆమె వయసు 59 ఏళ్లు. మహిళా సైంటిస్ట్ గా ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మాలిక్యులర్ బయోలజిస్ట్ గా పని చేస్తుంటారు. అమెరికాకు చెందిన ఆమె (సుజానే ఈటన్).. మాక్స్ ఫ్లాంక్ ఇన్ స్టిట్యూట్ డ్రెస్డెన్ వర్సిటీలో వర్క్ చేస్తుంటారు.
ఇటీవల ఆమె ఒక కాన్ఫరెన్స్ లో పాల్గొనటం కోసం గ్రీస్ కు వెళ్లారు. జులై 2 నుంచి ఆమె ఆచూకీ లభించటం లేదు. దీంతో.. ఆమె కుటుంబ సభ్యులు.. స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఆచూకీ కోసం వెతుకుతున్న గ్రీస్ పోలీసులకు రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి ఒక బంకర్ లో ఆమె మృతదేహం లభించించటం సంచలంగా మారింది.
59 ఏళ్ల మహిళ.. ఆ బంకర్ లోకి ఎలా వెళ్లారు? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఆమెకు ఎదురైన పరిస్థితి పగోడికి కూడా రావొద్దన్న భావన కలగటం ఖాయం. ఆమెను ఒక కారుతో తొక్కించేసిన గ్రీస్ యువకుడు.. ఆమె మృతదేహంపై రేప్ కు పాల్పడిన దారుణాన్ని పోలీసులు గుర్తించారు.
శరీరంపై ఉన్న ఆధారాల కారణంగా ఆమె హత్యకు గురయ్యాక అత్యాచారానికి గురైనట్లుగా తేల్చారు. ఈ దారుణానికి పాల్పడిన ఒక గ్రీసు యువకుడ్ని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. లోతుగా జరిపిన విచారణలో తాను చేసి దుర్మార్గపు పనిని పోలీసులకు చెప్పటంతో వారు అవాక్కు అయినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అతడ్ని కోర్టుకు హాజరు పర్చనున్నారు. ఇలాంటి వారిని మృగాలతో పోలుస్తామంటే.. అవి కూడా ఒప్పుకోవేమో?