ఇరాక్ లో తమకు కొరకరాని కొయ్యగా మారిన ఇరాన్ సైన్యాధ్యక్షుడు సొలేమానీని హతమార్చిన అమెరికా మరో అదే దేశానికి చెందిన కమాండర్ ను ఇలానే లక్ష్యంగా చేసుకున్నట్టు సంచలన విషయం లీక్ అయ్యింది. ఈ మేరకు అమెరికా రక్షణ విభాగానికి చెందిన వాషింగ్టన్ లోని ఉన్నతాధికారులు ఈ విషయాన్ని తెలిపారు.
ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ)కి చెందిన ఇరాన్ కమాండర్ అబ్దుల్ రెజా షెహ్ లాయ్ ని కూడా చంపేందుకు అమెరికా విఫలయత్నం చేసినట్టు సంచలన విషయం వెల్లడైంది. సోలేమానీ తరహాలోనే ఇతడిని చంపడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుమతి ఇచ్చినట్టు అమెరికా రక్షణ అధికారులు తెలిపారు.
ఈ ఇద్దరిని చంపితే ఇరాన్ బలం పడిపోతుందని.. వారి సేనలు చెల్లా చెదురు అవుతాయని అమెరికా ప్లాన్ చేసింది. కానీ ఇరాన్ సైన్యాధ్యక్షుడిని చంపిన అమెరికా ఇరాన్ కమాండర్ మాత్రం చంపలేక పోయిందట.. ఎలా విఫలమైందన్న విషయాన్ని వారు వెల్లడించలేదు.
ఇప్పటికే ఇరాన్ కమాండ్ అబ్దుల్ రెజాపై అమెరికా 15 మిలియన్ డాలర్ల రివార్డ్ ప్రకటించింది. ప్రస్తుతం ఇతడు యెమెన్ లో ఉండి అమెరికా సేనలపై ఇరాక్ లో దాడులు చేయిస్తున్నాడు. హుతి తిరుగుబాటు దారులకు మద్దతుగా నిలుస్తున్నాడు.