హెచ్‌1బీ వీసాల‌పై అమెరికా కొత్త క్లారిటీ ఇదే

Update: 2017-06-02 15:02 GMT
నిపుణులైన టెకీలు అమెరికా వెళ్లేందుకు అనుమ‌తి ఇచ్చే  హెచ్1బీ వీసాల ద‌ర‌ఖాస్తుల విష‌యంలో అమెరికా మ‌రో స్ప‌ష్ట‌త ఇచ్చింది. ఏటా మొత్తం ఇచ్చే 85,000 వీసాల్లో అమెరికాలో ఉన్నత విద్య అభ్య‌సించిన వారికి 20 వేల వీసాలు, విదేశాల్లోకి వారికి 65,000 వేల వీసాలు ఇవ్వ‌నున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికాలో ఉన్న‌త విద్య అభ్య‌సించిన‌ట్లుగా పేర్కొంటూ ద‌ర‌ఖాస్తులు చేసుకునే వారు తాము ప‌ట్ట‌భ‌ద్రులయే స‌మ‌యానికి స‌ద‌రు యూనివ‌ర్సిటీ ``యునైటెడ్ స్టేట్ ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్`` అనుమ‌తి క‌లిగి ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. అలా కాని ప‌క్షంలో వారి ద‌ర‌ఖాస్తును ఆ కేట‌గిరీలో ఆమోదించ‌బోమ‌ని తాజాగా విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించింది.  

కాలిఫోర్నియాకు లీనా ఆర్ కామ‌త్ హెచ్‌1బీ వీసాకు ద‌ర‌ఖాస్తు చేస్తూ తాను అమెరికాలో ఉన్నత విద్య అభ్య‌సించినందుకు ఆ కేట‌గిరీలో త‌న‌కు వీసా మంజూరు చేయాల‌ని ద‌ర‌ఖాస్తు చేశారు. అయితే కాలిఫోర్నియా స‌ర్వీస్ సెంట‌ర్ ఆమె విజ్ఞాప‌న‌ను తిర‌స్క‌రించింది. నూత‌న నిబంధ‌న‌ల ప్ర‌కారం అమెరికాలోని ఉన్న‌త విద్య అభ్య‌సించిన హెచ్‌1బీ వీసాల ప‌రిధిలోకి ఆమె రార‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. లీనా ఆర్ కామ‌త్‌ విద్యార్హ‌త పొందిన స‌మ‌యంలో ఆమె అభ్యసించిన కాలిఫోర్నియాలోని ఇంట‌ర్నేష‌న‌ల్ టెక్నాల‌జీక‌ల్ యూనివ‌ర్సిటీకి ``యునైటెడ్ స్టేట్ ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్`` అనుమ‌తి పొంది లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. తాజాగా ఇచ్చిన వివ‌ర‌ణ ప్ర‌కారం స‌ద‌రు అభ్య‌ర్థి డిసెంబ‌ర్ 31, 2010లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అయితే అప్ప‌టికి స‌ద‌రు వ‌ర్సిటీకి అక్రిడిటేష‌న్ రాలేదు. అంతేకాకుండా క‌నీసం ముంద‌స్తు అక్రిడిటేష‌న్ అనుమ‌తి సైతం క‌లిగిలేదు. వెస్ట‌ర్న్ అసోసియేష‌న్ ఆఫ్ స్కూల్స్ ఆండ్ అసోసియేష‌న్ (వాస్క్‌) 2011లో స‌ద‌రు యూనివ‌ర్సిటీకి క్యాండిడ‌సీ స్టేట‌స్‌ ను అనుమ‌తించిందని వివ‌రించింది.

ఇదిలాఉండ‌గా... అమెరికా సరుకులనే కొనండి.. అమెరికన్‌ లనే పనిలో పెట్టుకోండి అంటూ ప్ర‌చారం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  స్థానికులకే ఉద్యోగాలు కల్పించేందుకు హెచ్1బీ వీసాలకు కళ్లెం వేశారు. విదేశాల నుంచి ఉన్నతస్థాయి నిపుణులను మాత్రమే అమెరికాలోకి అనుమతించాలని, అధిక జీతం పొందేవారికే హెచ్1బీ వీసాలు ఇవ్వాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఐటీ విప్లవానికి జీవంపోసి అపార సంపదను సృష్టించిన హెచ్1బీ వీసాను అమెరికా ప్రభుత్వం అందనంత ఎత్తులో నిలబెట్టనుంద‌నే వార్త‌ల‌కు బ‌లం చేకూర్చిన‌ట్ల‌యింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News