పిల్లలకు ఫైజర్ టీకా ఇచ్చేందుకు ఓకే చెప్పిన అగ్రరాజ్యం

Update: 2021-10-31 16:30 GMT
ప్రపంచాన్ని అట్టుడిగిపోయేలా చేసిన కరోనాకు చెక్ చెప్పేందుకు అంతో ఇంతో సాయం చేస్తుందని భావిస్తున్న వ్యాక్సిన్లు ఇప్పటివరకు 18 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే ఇవ్వటం తెలిసిందే. పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరుగుతున్న వేళ.. చిన్న పిల్లలకు సైతం వ్యాక్సిన్ అందించేందుకు వీలుగా ప్రయోగాలు సాగుతున్నాయి. దీనికి సంబంధించి తాజాగా ఫైజర్ సంస్థ రూపొందించిన వ్యాక్సిన్ కు అమెరికా ఆహార.. ఔషద నియంత్రణ సంస్థ అత్యవసర వినయోగ అనుమతులు మంజూరు చేసింది.

దీనికి సంబంధించి నవంబరు రెండున  కీలక భేటీ కానుంది. ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల లోపు పిల్లల్లో ఎలాంటి ఆరోగ్య స్థితిగతులు ఉన్న వారికి టీకా ఇవ్వాలన్న దానిపై కమిటీ కీలక సిఫార్సులు చేయనుంది. అన్ని అనుకున్నట్లుగా సాగితే.. నవంబరు మొదటి వారంలోపు ఫైజర్ టీకా పంపిణీ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. టీనేజర్లకు.. యువకులకు.. పెద్ద వయస్కులకు టీకాలు ఇస్తున్నారు కానీ.. పిల్లలకు మాత్రం అందుబాటులోకి రాలేదు. తాజాగా ఆ ఇబ్బందిని అధిగమిస్తూ.. ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల వయసున్న వారికి టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మొదటి డోసు ఇచ్చిన మూడు వారాల విరామం తర్వాత రెండోడోసును పిల్లలకు అందజేయనున్నారు.

అమెరికా వ్యాప్తంగా మొత్తం 2.8 కోట్ల మంది పిల్లలు ఈ టీకా వేసుకోవటానికి అర్హత ఉందని భావిస్తున్నారు. ఫైజర్ రూపొందిస్తున్న మరో ప్రత్యేక వ్యాక్సిన్ ను 12-15 ఏళ్ల లోపు పిల్లలకు ఈ మే నుంచి ఇవ్వనున్నారు. ఫైజర్ తుది లక్ష్యం రెండేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య లోపు వారికి.. ఆరు నెలల నుంచి రెండేళ్ల లోపు వారికి టీకాను అందుబాటులోకి తీసుకురావటం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదిలా ఉంటే.. మన దేశంలోనూ నవంబరు నెలాఖరు నుంచి 12 - 17 ఏళ్ల లోపు వారికి టీకాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోసారి ప్రపంచంలోని పలు దేశాల్లో కొవిడ్ కేసులు మరోసారి పెరుగుతున్ననేపథ్యంలో చిన్నారులకు టీకాలు వేసే కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. 
Tags:    

Similar News