హెచ్‌1బీ వీసాల‌పై అమెరికా అడ్డుపుల్ల‌లు..!

Update: 2017-08-03 06:00 GMT
అవ‌కాశాల స్వ‌ర్గ‌దామంగా భావించే అమెరికాలోభార‌తీయుల‌కు అత్యంత ప్రియ‌మైన‌ది హెచ్‌1బీ వీసా. అమెరికా వర్కర్ల స్థానంలో చౌకగా లభించే విదేశీ వర్కర్లను నియమించుకోవడం కోసం ఔట్‌ సోర్సింగ్ సంస్థలు హెచ్- 1బి - ఎల్-1 వీసాలను ఉప‌యోగించుకుంటున్నాయి. వీటి ద్వారా ల‌బ్ది పొందింది అత్య‌ధిక సంఖ్య‌లో భార‌తీయులేన‌నే విష‌యం ఇటీవ‌లే తెర‌మీద‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే హెచ్‌1బీ వీసాల జారీకి అడ్డుక‌ట్ట వేసేందుకు మ‌రో ప్ర‌య‌త్నం మొద‌లైంది. హెచ్‌1బీ వీసాల‌దుర్వినియోగం చేయడాన్ని ఆపాలని, అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల్లో పలుకుబడి క‌లిగిన‌న సభ్యులతో కూడిన బృందం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు ఒక లేఖ రాసింది. జూలై 27న రాసిన ఈ లేఖను మంగళవారం మీడియాకు విడుదల చేశారు.

కాంగ్రెస్ సభ్యుడు బిల్ పాస్క్రెల్ నేతృత్వంలో రూపొందించిన ఈ లేఖపై సెనేటర్ రిచర్డ్ డర్బిన్ - కాంగ్రెస్ సభ్యులు డేవ్ బ్రాట్ - రో ఖన్నా - పౌల్ ఎ గోసర్ తదితరులు సంతకాలు చేశారు. వీసా లోపాలను తొలగించి అమెరికా వర్కర్లకు రక్షణ కల్పించడం కోసం అత్యున్నత నైపుణ్యం ఉండే ఉద్యోగాలను అమెరికా వర్కర్లకు లభించకుండా చేస్తున్న ఔట్‌ సోర్సింగ్ కంపెనీలను కట్టడి చేయడం కోసం మొత్తం వీసా విధానాన్ని ప్రక్షాళన చేయడం కోసం తాము ఒక చట్టాన్ని ప్రవేశపెట్టినట్లు బ‌ల‌మై ఆ గ్రూపు తమ లేఖలో పేర్కొంది. చాలాకాలంగా హెచ్-1బి వీసాల దుర్వినియోగం జరుగుతున్న కారణంగా తాము ఈ లేఖ రాస్తున్నామని, అధ్యక్షుడిగా మీకున్న విశేషాధికారాలను ఉపయోగించి దీనికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నామని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే చట్టంలో లోపాలున్న కారణంగా వీసా విధానాన్ని చట్టపరంగా సంస్కరించాల్సిన అవసరం కూడా ఉందని తాము భావిస్తున్నామని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.

కాగా, అగ్రరాజ్యం అమెరికాలో పనిచేయాలన్న మోజు రోజురోజుకూ పెరుగుతోందని ఇటీవ‌లే నివేదిక‌లు విడుద‌ల‌యిన సంగ‌తి తెలిసిందే. తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో పనిచేసేందుకు హెచ్-1బి వీసాల కోసం గడచిన 11 సంవత్సరాల కాలంలో దరఖాస్తు చేసుకున్న భారతీయుల సంఖ్య అక్షరాల 21 లక్షలు. యుఎస్ సిటిజన్‌ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తాజా నివేదిక ప్రకారం వారి సగటు జీతం 92,317 అమెరికన్ డాలర్లు. ఈ నివేదిక ప్రకారం 2007నుంచి 2017, జూన్ వరకు 34లక్షల మంది హెచ్-1బి వీసాలకోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో భారత్‌ నుంచి దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 21 లక్షలు. వీరిలో 26 లక్షల మందికి అమెరికా హెచ్-1బి వీసాలను మంజూరు చేసింది. హెచ్-1బి వీసాలకోసం దరఖాస్తు చేసుకున్న వారిలో చైనాకు చెందిన వారు 2,96,313 మంది ఉండడం విశేషం. ఫిలిప్పీన్స్ నుంచి 85,918 - దక్షిణకొరియా నుంచి 77,359 - కెనడా నుంచి 68,228మంది ఉన్నారు.
Tags:    

Similar News