కాంగ్రెస్ అధిష్ఠానానికి సన్నిహితుడైన దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన సీన్ చోటు చేసుకుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరి పంచాయితీ వారిది అన్నట్లుగా.. ఏ రాజకీయ పార్టీ అయినా.. వారు ప్రాతినిధ్యం వహించే ప్రాంతానికి సంబంధించిన నేతలతో కలిసి మీడియాతో మాట్లాడటం జరుగుతోంది.
అందుకు భిన్నంగా.. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో.. దిగ్విజయ్ సింగ్‌కు ఒక పక్కన ఏపీ పార్టీ రథసారధి రఘువీరారెడ్డి.. మరోవైపు తెలంగాణ పార్టీ సారధి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూర్చోవటం ఆసక్తినికి రేకెత్తించింది. రాష్ట్ర విభజన తర్వాత.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా ఆయా అంశాల్ని ప్రస్తావిస్తే.. అందుకు భిన్నంగా ఆదివారం మాత్రం ఉమ్మడి ప్రెస్‌మీట్ నిర్వహించటం విశేషం.
విభజనకు ముందే.. ఎవరి పంచాయితీ వారిది అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు వ్యవహరించే వారు. అధికారికంగా విడిపోయిన తర్వాత మాత్రం ఉమ్మడి ప్రెస్‌మీట్ పెట్టటం చూసినప్పుడు.. ఆ బుద్ధే విభజన సమయంలో ఉండి.. ఆచితూచి విభజన వ్యవహారం జరిపి ఉంటే.. ఇవాళ ఉన్న చాలా పంచాయితీలు లేకుండా ఉండి ఉండేవేమో.