మొత్త‌బ‌డ్డ కోమ‌టిరెడ్డి..ఉత్త‌మ్‌ తో జ‌ట్టుకు ఓకే!

Update: 2018-01-09 16:58 GMT
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత‌ - సీఎల్పీ ఉపనేత అయిన కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మెత్త‌బ‌డ్డారా?  పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డిపై ఇన్నాళ్లు ఎర్ర‌జెండా ఎగుర‌వేసిన కోమ‌టిరెడ్డి...త‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లించే చాన్స్  లేద‌ని తెలుసుకున్నారా?  పోరాటం చేయ‌డం కంటే... స‌ఖ్య‌త‌తో త‌న ఉనికి చాటుకోవ‌డ‌మే మేల‌ని భావిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోందని, తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇందుకు  నిద‌ర్శ‌న‌మ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంటున్నాయి.

రాజ‌కీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కాంగ్రెస్‌ లో అసంతృప్తిగా ఉన్నార‌ని ప్రచారం సాగుతోంది. ప్ర‌స్తుత పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డిని ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేసిన కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఆ ప్ర‌య‌త్నంలో ఫెయిల‌య్యార‌ని టాక్ ఉంది. కాంగ్రెస్ వ్య‌వ‌హారాల మాజీ ఇంచార్జీ దిగ్విజ‌య్ సింగ్‌ తో ఉత్త‌మ్‌ కు ఎర్త్ పెట్టాల‌ని భావించిన‌ప్ప‌టికీ...దిగ్విజ‌య్ ప‌ద‌వి ఊడిపోవ‌డం...ఆయ‌న త‌ర్వాత వ‌చ్చిన ఇంచార్జీ ఆర్‌సీ కుంతియా..రాబోయే ఎన్నిక‌ల వ‌ర‌కు ఉత్త‌మ్ సార‌థ్యం కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో...కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఒకింత నిరాశ‌ప‌డ్డార‌ని వార్త‌లు వ‌చ్చాయి. మ‌రోవైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ లో చేర‌డంతో త‌మ‌కు ప్రాధాన్యం త‌గ్గిపోయింద‌ని ఈ సోద‌రులు భావిస్తున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో కోమ‌టిరెడ్డి సంధి ప్ర‌క‌ట‌న చేశారని అంటున్నారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష కార్యాలయంలో  సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ గత మూడున్నరేల్లుగా తాను పీసీసీ అధ్యక్ష పదవి ఆశించిన మాట వాస్తవమేనని, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఉత్తమ్‌ తో కలిసి పని చేస్తామన్నారు. ఒక్కొక్క సీనియర్‌ నేత పది నియోజకవర్గాలను బాధ్యత తీసుకుని గెలిపించాలని కోమ‌టిరెడ్డి కోరారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్‌ పార్టీకి 70 నుంచి 80 సీట్లు వస్తాయని కోమ‌ట‌ ధీమా వ్యక్తం చేశారు. 24 గంటల కరెంట్‌ సరఫరాను నల్లగొండ జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రవేశ పెట్టిందన్నారు. భూగర్భ జలాలు తగ్గిపోతాయని గ్రామ, గ్రామాన పంచాయతీలు తీర్మానం చేసినట్టు తెలిపారు. 24 గంటల కరెంట్‌పై ముఖ్యమంత్రి సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Tags:    

Similar News