పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికరమైన ప్రకటన చేశారు. దానికి తోడుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాకూటమిలోని కాంగ్రెస్ - టీడీపీ - సీపీఐ - టీజేఎస్ - ఎమ్మార్పీఎస్ నాయకులు హైదరాబాద్ గోల్కొండ హోటల్ లో సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చిన సర్వే నమ్మవద్దని తనకు ఢిల్లీకి చెందిన ఓ జర్నలిస్ట్ విజ్ఞప్తి చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
ముందస్తు ఎన్నికలు - పోలింగ్ తీరు - ఏర్పడబోయే సర్కారు గురించి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ 2018 తెలంగాణ శాసన సభ ఎన్నికల లెక్కింపు కోసం ఎదురు చేస్తున్నామన్నారు. “పోలింగ్ లో పాల్గొన్న అందరికీ పీపుల్స్ ఫ్రంట్ తరపున ధన్యవాదాలు. పోలింగ్ నిర్వహించడంలో.. ఎన్నికల కమిషన్ ఫెయిలైంది. సీఈఓ క్షమాపణ కోరడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఓటర్ స్లిప్ లో తప్పులున్నాయని ముందునుంచీ చెబుతూనే ఉన్నాం. ఈవీఎంల ట్యాoపరింగ్ విషయంలో కూటమి కార్యకర్తలు అలర్ట్ గా ఉండాలి. స్ట్రాంగ్ రూమ్ లో పెట్టిన తరువాత ఎవరు అక్కడకి వెళ్లకూడదు. స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర అన్ని పార్టీ ల కార్యకర్తలకు అనుమతి ఇవ్వాలి`` అని డిమాండ్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ ద్వారా టీఆర్ ఎస్ నేతలు తామే అధికారంలోకి వస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ 75 నుంటి 80 సీట్లతో పీపుల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుంది`` అని ధీమా వ్యక్తం చేశారు. “తాము గెలవబోయే సీట్ల విషయంలో కేసీఆర్ - కేటీఆర్ 100 నుండి 80కి వచ్చారు.11 వ తేదీన 30 సీట్లు అంటారు. మా ఎగ్జిట్ పోల్స్ నమ్మకండి అని ఇండియా టుడే సీఈఓ రాజ్ దీప్ సర్దే శాయ్ చెప్పారు. కేసీఆర్ పాలనపై జనం ఆగ్రహంగా ఉన్నారు. అందరం కలిసి కూటమిగా వెళ్లడం కలిసొచ్చింది. గడ్డం తీసేసే టైమ్ వచ్చింది. డిసెంబర్ 11 తర్వాత తీయడమే`` అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పోస్టల్ బ్యాలెట్ వేసే వాళ్ళు తమకే ఓటేయాలని కోరారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ.. “ప్రజల గొంతుకగా ఉండడం కోసమే కూటమిగా ఏర్పడ్డాం. కనీస ఉమ్మడి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. రాజ్యాంగ బద్ధమైన కన్వీనర్ పదవిలో కోదండరాం ఉంటారు. 86 సంఘాలు జేఏసీగా ఏర్పడి కొత్త ప్రభుత్వం రావాలని కోరుకున్నాయి” అన్నారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజా కూటమిని గెలిపిస్తాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. కూటమికి సైలెంట్ ఓట్ పడిందన్నారు. డబ్బుకు లొంగకుండా జనం ఓటేశారని తెలంగాణ జన సమితి నేత విద్యాధర్ రెడ్డి అన్నారు. నియంతృత్వ పాలనకు తెర పడుతోందని ఎమ్మార్పీస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. కాగా, ఈ సమావేశానికి టీజేఎస్ నేత కోదండరాం గైర్హాజరయ్యారు.