అది మహాసంగ్రామం.. కత్తులు పట్టుకొని గులాబీ దళం యుద్ధానికి సిద్ధంగా ఉంది.. ప్రత్యర్థి వస్తే పొడిచేద్దామని కాచుకు కూర్చున్నారు.. పిట్టకు పెట్టి ఎదురుచూస్తున్నట్టు ఆబగా ఉన్నారు.. కానీ ఎంతకూ రారేం.. గులాబీ సైనికుల్లో శక్తి వృథా అవుతోంది. యుద్ధంలో ఓడించి వద్దామనుకుంటే ప్రత్యర్థులు హస్తిన నుంచి రావాలే.. వారు వచ్చేదెప్పుడు.. వాళ్ల చేతిలో చచ్చేదెప్పుడు.. ఇలా నీరుగారిపోతున్న గులాబీదళానికి.. ఇంకా నీరుగారిపోయేలా హస్తిన బాట పట్టాడు ‘ఉత్తముడు’. ఆ సీల్డ్ కవర్ సైనికులకు ఆమోదం తెలుపడం కోసం మిత్రపక్షాలను హస్తినకు పిలిపించారు. వారంతా కలగం పులగం చేసి యుద్ధ వీరులను పైకి తీస్తారట.. ఈలోపు పుణ్యకాలం కాస్తా గడిచిపోయి ఏదైనా జరిగేయొచ్చు..
కాంగ్రెస్ సీల్డ్ కవర్ అభ్యర్థుల సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ ను ఎంపిక చేసుకొని సీల్డ్ కవర్ లో ఢిల్లీ వెళ్లడం.. దానిపై చర్చించేందుకు చంద్రబాబు - కోదండరాం వెళుతుండడంతో అంతటా ఆసక్తి నెలకొంది. ఇంతచేసి సగం సీట్లకే మాత్రమే ఆమోద ముద్రనంట.. మరో సగం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ప్రకటిస్తారట.. అసమ్మతి - అసంతృప్తిని కాంగ్రెస్ పైకి రాకుండా ఈ డ్రామాలడుతున్నట్టు కాంగ్రెస్ లోని ఓ వర్గం ఆడిపోసుకుంటోంది.
కేసీఆర్ - కేటీఆర్ లకు ఇప్పుడు ఇదే ‘ఢిల్లీ సీల్డ్ కవర్ కహానీ’యే ఆయుధంగా కనపడుతోంది. కేటీఆర్ వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులు ఢిల్లీ నుంచి రావాలే.. రాహుల్ గాంధీ ఎంపిక చేయాలే.. కానీ సింహం లాంటి తెలంగాణ బిడ్డ కేసీఆర్ మీ మట్టి నుంచే పుట్టుకొచ్చాడంటూ సెంటిమెంట్ రాజేస్తున్నాడు. సీల్డ్ కవర్ కు , స్థానికతకు లింక్ పెట్టి ఏకిపారేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిమోట్ రాహుల్ చేతిలో.. అందులోని సెల్లులు చంద్రబాబు చేతిలో ఉంటాయంటూ విమర్శిస్తున్నారు. అదే కేసీఆర్ కు అధికారమొస్తే అంతా తెలంగాణ చేతిల్లోనే అంటూ ఆశపుట్టిస్తున్నారు.
ఇలా తెలంగాణ సీల్డ్ కవర్ సీట్ల ఎంపిక పై అంతటా అసంతృప్తే వ్యక్తమవుతోంది. తెలంగాణ అభ్యర్థులను ఢిల్లీ పెద్లలేంటి ఎంపిక చేసేది అన్న గులాబీ నేతల ప్రశ్నలకు కాంగ్రెసోళ్ల సమాధానమే కరువైంది. ఈ పాయింట్ ను గట్టిగా పట్టుకున్న కేసీఆర్ అంటూ టీం ప్రచారాస్త్రాంగా తెగ వాడేస్తోంది..