మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయ వేడి రగులుకుంటోంది. ముందస్తు ఎన్నికల వేళ.. కాంగ్రెస్ , టీఆర్ఎస్ సై అంటే సై అంటున్నాయి. విమర్శల వాడి పెరిగింది. అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల సాయంతో కాంగ్రెస్ నాయకుల పని పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. . జగ్గారెడ్డిని ఇటీవలే అరెస్ట్ చేసి పంపగా.. ఇప్పుడు రేవంత్ రెడ్డిని బోనులో నిలబెట్టేందుకు రెడీ అయ్యారని కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వహించే సంగారెడ్డి లో ముస్లిం మైనార్టీ సభను ఏర్పాటు చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లోని బలమైన నేతలను టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్న కేసీఆర్ ను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జైలుకు పంపిస్తామని సంచలన ప్రకటన చేశారు. కేసీఆర్ తన అధికార బలంతో పోలీసులను పావుగా వాడుకుంటూ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ ఆదేశించాడని ప్రజా స్వామ్య హక్కులను కాలరాస్తే ఊరుకోబోమని ఉత్తమ్ హెచ్చరించారు.
కేసులతో కాంగ్రెస్ ను హింసించాలని కేసీఆర్ చూస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. జగ్గారెడ్డిని సంగారెడ్డిలో ఎదుర్కోలేకే కేసులతో జైలుకు పంపి గెలవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలు వచ్చిన 14 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న జగ్గారెడ్డి భార్య నిర్మలను ఓదార్చారు. మీ వెంటే కోటి మంది కాంగ్రెస్ సైన్యం ఉందని.. మీరేం ఆందోళన చేయవద్దని భరోసానిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని.. జగ్గారెడ్డిని 50వేల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
నకిలీ పాస్ పోర్టుల కేసులో అసలు ముద్దాయిలు కేసీఆర్, హరీశ్ రావు అని ఉత్తమ్ అన్నారు. సీఐడీ నివేదికలో కానీ, ఎఫ్ఐఆర్ లో కానీ జగ్గారెడ్డి పేరును ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. సీఆర్పీసీ 41 ప్రకారం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడమేంటని.. జగ్గారెడ్డి ఏమైనా హంతకుడా అని ఉత్తమ్ నిలదీశారు.
తెలంగాణ పోలీసులు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మానవ అక్రమ రవాణా కేసులో ఈ సోమవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. నకిలీ పాస్ పోర్టులు సృష్టించి గుజరాతీ వ్యక్తులను తన ఫ్యామిలీ పేరిట జగ్గారెడ్డి అమెరికాలో వదిలి వచ్చారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసు ఇప్పుడు జగ్గారెడ్డి మెడకు చుట్టుకోవడం రాష్ట్రంలో సంచలనమైంది. అయితే సరిగ్గా ముందస్తు ఎన్నికల వేళ ఈ చర్యను తీసుకోవడంతో ఈ పరిణామం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తీసుకున్నట్టు ప్రచారంలోకి వచ్చింది.