మ్యానిపెస్టో..... ఎన్నికలలో గెలిస్తే తామూ ఏం చేస్తోమో రాజకీయ పార్టీలు ప్రజలకు ఇచ్చే నివేదిక. దేశ వ్యాప్తంగా ఎప్పుడు ఎన్నికలు జరిగిన ప్రతి రాజకీయ పార్టీ తమ ఎన్నికల వాగ్దానాలను ఈ మ్యానిపెస్టోలో పొందుపరుస్తారు. దీనిని బట్టి ప్రజలు ఎవరికీ ఓటు వేయాలో నిర్ణయించుకుంటారు. ప్రతి ఎన్నికలకు ముందు అన్నీ రాజకీయ పార్టీలకు ఈ మ్యానిఫెస్టో ఓ భగవద్గీత - ఓ బైబిల్ - ఓ ఖురాన్. అన్నీ పార్టీలు దీనిని అనుసరించే ఎన్నికలకు వెడతాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేస్తోంది. ఇందులో తెలంగాణ ప్రజలకు వరాల జల్లు కాదు.... వరాలే వరదే కురిపిస్తోంది. ప్రజలు అడిగినా అడగకపోయినా అన్నీ చేసేస్తామంటూ ఈ మ్యానిఫెస్టోకు రూపకల్పన చేస్తోంది. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపడతామని ఈ మ్యానిఫెస్తోలో పేర్కోన్నారు. ఎసీ - ఎస్టీ వర్గాలకు - కులాలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందజేస్తామని పేర్కోన్నారు.
ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని తామూ కొనసాగిస్తామని అంటున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తాంగా తెల్ల కార్డు ఉన్నవారందరికీ సన్న బియ్యం ఇస్తామని ముందస్తు మ్యానిఫెస్టోలో పేర్కోంటున్నారు. ఇక తెలంగాణలో వితంతు - వ్రుద్దుల ఫించన్లతో పాటు ఇతర ఫించన్లన్ని యథావిధిగా అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించనున్నారు. ఏడో తరగతి వరకూ విద్యర్దులకూ ఉచిత సైకిల పథకం అమలు చేస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి మ్యానిఫెస్టోలో పొందుపరుస్తామని అన్నారు. సరే ఇవన్నీ అమలు చేయాలంటే ఒక రాష్ట్ర ఏడాది బడ్జేట్ సరిపోదని - మూడు దేశాల వార్షిక బడ్జేట్ కావాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గద్దె దించేందుకు ఇలాంటి హామీలు ఇవ్వడం ఆచరణ సాధ్యమేనా అని అంటున్నారు. మరోవైపు అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితీ కాంగ్రెస్ పార్టీ హమీలకు దీటుగా మరీన్ని కొత్త పథకాలు ప్రకటించే అవకాశమూ ఉందని వారి విశ్లేషణ. ఎన్నికలకు ముందు ఏది సాధ్యమో ..... ఏది అసాధ్యమో యోచించకుండా ఇలా హామీలు గుప్పించడం దేనికి దారి తీస్తుందో అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.