ఫ‌లితాలపై కాంగ్రెస్ అనుమానం!

Update: 2018-12-11 07:01 GMT
తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు నిజం కాదా?  టీఆర్ ఎస్ మ్యానిప్యులేట్ చేసిందా? ఇవి కాంగ్రెస్ అనుమానాలు. తెలంగాణ ఎన్నికల్లో ఈవీఎంల టాంపరింగ్‌ జరిగినట్లు టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - వీహెచ్ తదిత‌ర కాంగ్రెస్ నేత‌లు అనుమానించారు. ఫలితాలను చూస్తే  టాంపరింగ్ చేయ‌బ‌ట్టే ఎవ‌రు ఓడిపోతారో అనే విష‌యాన్ని టీఆర్ ఎస్ నేత‌లు ముందు చెప్ప‌గ‌లిగార‌న్న‌ది ఉత్త‌మ్ ఆరోప‌ణ‌. వారు ముందే అంత బ‌లంగా ప్ర‌క‌టించ‌డం, అవే ఫ‌లితాలు రావ‌డం టాంపరింగ్ జరిగింద‌నిపిస్తుంద‌ని ఉత్త‌మ్ అన్నారు.

ఎక్క‌డో పొర‌పాటు జ‌రిగింద‌ని - వీవీ ప్యాట్‌ స్లిప్ ల లెక్కింపు కూడా తప్పక జరపాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ప్రజా కూటమి అభ్యర్థులు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో రిటర్నింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఉత్త‌మ్ పిలుపునిచ్చారు. దీనిపై ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద‌కు వెళ్ల‌నున్న‌ట్లు చెప్పారు. ఆయన ఏమ‌న్నారంటే... ‘నేను మొదట్నుంచి చెబుతున్నా.. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారని - నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఫలితాలు చూస్తే ట్యాంపరింగ్  జరిగనట్లు స్పష్టంగా తెలుస్తోంది* అన్నారాయ‌న‌.

వీహెచ్ కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బ్యాలెట్‌ పేపర్‌ లు పింక్‌ కలర్‌ లో ఉన్నప్పుడే మాకు అనుమానం వచ్చింద‌ని చెప్పిన ఆయ‌న జీహెచ్‌ ఎంసీ ఎన్నికలప్పుడే డౌటు ప‌డ్డామ‌న్నారు. అపుడు కూడా ట్యాంపరింగ్‌ జరిగింది. లేకుంటే టీఆర్‌ ఎస్ తాము గెలిచే స్థానాల సంఖ్యను అంత‌ ఖచ్చితంగా ఎలా చెబుతారు? అని వీహెచ్ ప్ర‌క‌టించారు. అయితే, ఇత‌ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుస్తుందంటే అక్క‌డా ట్యాంప‌రింగ్ జ‌రిగిందా అని అడుగుతారేమో అని వీమెచ్ దానిని కూడా ప్ర‌స్తావించారు. బయట రాష్ట్రాల గురించి నాకు తెలియ‌దు, ఇక్కడ ఈసీఐఎల్‌ ఉద్యోగులతో కేసీఆర్‌ కుమ్మక్కై ట్యాంపరింగ్ చేయించారు. ఇది ప్ర‌జ‌ల తీర్పు కానే కాదు అన్నారు వీహెచ్.
Tags:    

Similar News