పాలేరు ఉప ఎన్నిక వేడెక్కింది.తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికను సంప్రదాయం పేరిట ఏకగ్రీవం చేసుకోవటానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చాలానే కష్టపడింది. అయితే.. ఏకగ్రీవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నో అనటం.. తమ పార్టీ అభ్యర్థిగా మంత్రి తుమ్మలను తెర మీదకు తీసుకురావటంతో ఈ ఎన్నికకు ప్రాధాన్యత వచ్చేసింది. సీనియర్ నేత మరణంపై సానుభూతి లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ బరిలోకి రావటాన్ని ఆక్షేపిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అధికారపక్షంపై ఘాటైన విమర్శల్ని షురూ చేశారు. సీనియర్ నేత మరణంపై గౌరవం లేకుండా అధికారదాహంతో కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
భావోద్వేగంతో ఉప ఎన్నిక ఫలితాల్ని ప్రభావితం చేయాలన్న ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెక్ చెప్పేందుకు తెలంగాణ అధికారపక్షం సన్నద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఉప ఎన్నికను పర్యవేక్షిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ తాజాగా చేసిన ఒక సవాలు పాలేరు ఉప ఎన్నికను మరింత వేడి పుట్టించేలా చేసింది.
తమపై మాటల దాడి చేస్తున్న కాంగ్రెస్ చీఫ్ ను ఆత్మరక్షణలో పడేయటమే కాదు.. ఉప ఎన్నిక గెలుపు విషయంలో తాము చాలా స్పష్టంగా ఉన్నామన్న విషయాన్ని స్పష్టం చేసేలా.. తమ అధిక్యానికి.. అధిపత్యానికి తిరుగులేదన్నట్లుగా కేటీఆర్ తాజా సవాలు ఉండటం గమనార్హం. పాలేరు ఉప ఎన్నికలో తమ అభ్యర్థి ఓడిన పక్షంలో తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. ఒకవేళ.. కాంగ్రెస్ అభ్యర్థి కానీ ఓడిపోతే.. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ తన పదవికి రాజీనామా చేస్తారా? అంటూ కేటీఆర్ సవాలు సంధించారు. దీంతో.. వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
ఢీ అంటే ఢీ అన్నట్లు కాకుండా కేటీఆర్ సవాలు విషయంలో ఉత్తమ్ ఒక అడుగు వెనక్కి వేశారు. కేటీఆర్ ఓ బచ్చా అని.. అతగాడి సవాలుకు తాను స్పందిచాల్సిన అవసరం లేదని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు ఉత్తమ్. ఉప ఎన్నికకు సీఎం కేసీఆర్ బాధ్యత వహిస్తే తాను సమాధానం చెబుతానని.. కేటీఆర్ అయితే కాదన్న ఆయన మాటల్లో లాజిక్ లేదని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి తర్వాత నెంబరు టూ అయిన కేటీఆరే స్వయంగా సవాలుకు సిద్ధమైనప్పుడు.. బచ్చా అని వ్యాఖ్యానించటం తప్పించుకోవటమే తప్పించి మరొకటి కాదని చెబుతున్నారు. ఉత్తమ్ వ్యాఖ్య చూస్తే పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ దూసుకెళుతుందన్న సందేశాన్ని చెప్పినట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా? లేదా? అన్నదే పాయింట్ సినిమా డైలాగు ఉత్తమ్ కు తెలుసో.. లేదో..? తెలిసి ఉంటే.. ఈ తరహా కవరింగ్ చేసేవారు కాదేమో..?