కరోనా భయం ... దగ్గుతున్నాడని కాల్చేశాడు !

Update: 2020-04-16 05:30 GMT
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎవరు దగ్గినా, తుమ్మినా కూడా వారి పక్కనున్నవారు భయంతో వణికిపోతున్నారు. అయితే కరోనా అనుమానితుడన్న కారణంతో దాడులు కూడా జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వైరస్‌ ను వ్యాపింపజేసేందుకే ఉద్దేశ పూర్వకంగా దగ్గుతున్నాడని భావించి ఓ వ్యక్తిపై మరొక వ్యక్తి కాల్పులు జరిపిన ఘటన గ్రేటర్‌ నోయిడాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అసలేంజరిగిందంటే ... ఉత్తరప్రదేశ్‌ లోని దయానగర్ గ్రామంలో రాత్రి 9  గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. జర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో నలుగురు యువకులు లూడో గేమ్ ఆడినట్టు తెలిపారు. ఆ సమయంలో ప్రశాంత్ సింగ్‌  దగ్గడంతో అతని స్నేహితులకు అనుమానం వచ్చింది. ప్రశాంత్ కరోనా వైరస్‌ ను వ్యాప్తి చెందించేందుకే ఇలా చేస్తున్నాడని అనుమానించారు. దీనితో ప్రశాంత్ తో గొడవపడ్డారు. తాను కావాలని దగ్గలేదని ప్రశాంత్ చెప్పినా గుల్లు వినిపించులేదు. ఆలాఆ గొడవ పెరిగి పెద్దది కావడంతో ఒక్కసారిగా  ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన గుల్లు అనే యువకుడు ప్రశాంత్‌పై కాల్పులు జరిపాడు.

అయితే, బాధితున్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కరోనా బాధితుల్లో దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
ఒకవేళ ఎవరికైనా కరోనా ఉన్నట్టు అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించడమో.. స్థానిక అధికారులకు సమాచారం అందించడమో చేయాలని.. అంతే తప్ప దాడులకు పాల్పడటం సరికాదని పోలీసులు సూచిస్తున్నారు. అన్ని లక్షణాలు వైరస్ లక్షణాలే కాకపోవచ్చునని కూడా చెబుతున్నారు.
Tags:    

Similar News