చుక్క నీరు దొరక్క ప్రజలు అలమటిస్తోంటే… కేంద్రం ట్యాంకులతో పంపించే నీరు మాకొద్దు అంటూ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం తిరస్కరించింది. బుందేల్ ఖండ్ ప్రాంతంలో తీవ్ర నీటిఎద్దడి నెలకొనడంతో అక్కడికి నీటి రైలును కేంద్రం పంపించగా ఈ ఘాటు రిప్లై వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీ స్టేషన్ కు చేరుకున్న నీటి రైలును రాష్ట్ర అధికారులు అడ్డుకున్నారు. తమకు నీటి అవసరం లేదని తేల్చిచెప్పారు.
ఇదిలాఉండగా...మే7న ఉత్తర్ ప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రధాని నరేంద్ర మోడీని కలసి బుందేల్ ఖండ్ లో నెలకొన్న కరవు నీటి ఎద్దడి గురించి వివరించనున్నారు. అయితే బుందేల్ ఖండ్ కు ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించినప్పటికీ నీటిరైలును అధికారులు తిరస్కరించడం చర్చనీయాంశమైంది.