బాబు పాత గాయాలను కదుపుతున్న వీహెచ్
బాధలను, అవమానాలను ఎంత త్వరగా అయితే - అంత త్వరగా మర్చిపోవాలనుకుంటారు ఎవరైనా. కానీ, ఒక్కోసారి ఎవరో ఒకరు దాన్ని గెలికి మరీ గుర్తు చేస్తుంటారు. అది కూడా అందరూ మర్చిపోయిన సమయంలో మరోసారి గుర్తు చేసి మరింతమంది వచ్చి పరామర్శించేలా - దాని గురించి మాట్లాడుకునేలా చేస్తారు. ‘ఇన్ కేస్ యూ మిస్డ్ ఇట్’ అంటూ గుర్తు చేస్తారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుకి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎప్పుడో ఆయనకు జరిగిన చిన్న పాటి అవమానాన్ని టీ కాంగ్రెస్ నేత వీ.హనుమంతరావు మరోసారి అందరికీ గుర్తు చేశారు. కేసీఆర్ - పవన్ కల్యాణ్ ఎందుకు భేటీ అయ్యారన్న విషయంలో మాట్లాడిన ఆయన చంద్రబాబును మధ్యలోకి లాగారు. చంద్రబాబు తనకు మంచి ఫ్రెండు అని చెప్తూనే పాత గాయాలను గుర్తుచేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో క్లోజ్ గా మూవ్ అవతున్నారని.. కాపులను ఆకర్షించేందుకే ఆయన ఇలా చేస్తున్నారని హనుమంతరావు అన్నారు. అంతేకాదు... గతంలోనూ కేసీఆర్.. చంద్రబాబు కంటే పవన్ కు ప్రయారిటీ ఇచ్చారంటూ అప్పటి ఘటనను గుర్తు చేశారు. లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు మోదీ హాజరైనప్పుడు... పవన్ కు ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారని - చంద్రబాబు లేచి షేక్ హ్యాండ్ ఇచ్చేలోగానే ముందుకు వెళ్లిపోయారని గుర్తు చేశారు.
టీఆర్ ఎస్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదని... పత్రికలు - టీవీల్లో భారీ ఎత్తున ఇస్తున్న ప్రకటనల్లో ప్రచారం చేసుకుంటున్నదానికి - వాస్తవానికి ఎంతో వ్యత్యాసం ఉందని ఆరోపించారు. కానీ, ఇదేమీ తెలియకుండా ఏమాత్రం అవగాహన లేకుండానే కేసీఆర్ ను పవన్ కల్యాణ్ పొగుడుతున్నారని విమర్శించారు.