డీఎస్‌ ను ఎలా ఆపాలో కేసీఆర్‌ కు తెలుస‌ట‌!

Update: 2018-07-10 17:15 GMT
ఉమ్మ‌డి రాష్ట్రంలో ఓ వెలుగువెలిగి...కీల‌క ప‌ద‌వుల్లో కొన‌సాగి...అనంత‌రం కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ పోస్టు కోసం ఎదురు చూసిన సీనియ‌ర్ నాయ‌కుడు - మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎమ్మెల్సీ కోసం త‌ను ఎదురుచూస్తుంటే..త‌న శిష్యురాలిగా పేరొందిన సొంత జిల్లా నాయ‌కురాలికి ఆ ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డంతో హ‌ర్ట‌యిన డీఎస్ ఆ ఆవేద‌న‌లోనే కాంగ్రెస్‌ కు గుడ్‌ బై చెప్పి టీఆర్ ఎస్‌ లో చేరారు. అయితే సీనియ‌ర్ అయిన డీఎస్‌ ను గౌరవించి ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ద‌వి ఇచ్చిన కేసీఆర్ అనంత‌రం రాజ్య‌స‌భ‌కు కూడా పంపారు. అయితే, త‌దుప‌రి కాలంలో ఆయ‌న త‌న‌య ఎంపీ క‌విత‌తో పొరపొచ్చాలు రావ‌డం...ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ వేటుకు సిఫార‌సు చేయ‌డం...దాన్ని కేసీఆర్ పెండింగ్‌ లో పెట్ట‌డం...దీంతో సొంత పార్టీ అయిన కాంగ్రెస్ వైపు చూడ‌టం....తెలిసిన సంగ‌తే.

అయితే, డీఎస్ ఎంట్రీకి ముందే...ఆయ‌న‌కు కాంగ్రెస్ నుంచి ప్ర‌తిఘ‌ట‌న మొద‌ల‌వుతోంది. డీఎస్ సామాజికవ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు - పీసీసీ మాజీ చీఫ్ కూడా అయిన వీహెచ్ తాజాగా డీఎస్ తీరును ఎద్దేవా చేశారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ డి. శ్రీనివాస్ తీరుపై మండిప‌డ్డారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ కి అన్యాయం చేసి టీఆర్ ఎస్ పార్టీలో చేరాడని ఆయ‌న ఆరోపించారు. ఇప్పుడు టీఆర్ ఎస్ లో పక్కన పెట్టారని కాంగ్రెస్ లోకి వస్తాను అంటే మేము ఒప్పుకుంటామా? అంటూ సూటిగానే ప్ర‌శ్నించారు. `డీఎస్ ను మళ్ళీ కేసీఆర్ పిలిచి...శ్రీను అన్న అంటే..వెంట‌నే కేసీఆర్‌ కు డీఎస్‌ భజన చేస్తాడు.` అంటూ ఎద్దేవా చేశారు. డీఎస్‌ ను పార్టీ లోకి తీసుకోవాలో వద్దో  అని ఒక్కసారి కమిటీ నేతలు ఆలోచన చెయ్యాలని కోరారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి వీహెచ్ మండిప‌డ్డారు. 2014లో సమగ్ర సర్వే చేసి 54 శాతం బీసీలు ఉన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి  చెప్పారని అయితే వారి కోసం ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలేవి లేవ‌న్నారు. `ముఖ్యమంత్రికి బీసీలంటే ప్రేమలేదు. కానీ బీసీల ఓట్లు కావాలి. బీసీలకు నేను రిజ‌ర్వేషన్ ఇస్తాను అని చెప్పి ఇవ్వాళ సుప్రీం కోర్ట్ వెళ్లే డ్రామాలు ఆడుతున్నాడు. బీసీల కోసం ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం కాదు..చిత్త‌శుద్ధితో పనిచేయాలి`` అని వీహెచ్ కోరారు.

Tags:    

Similar News