ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవ‌చ్చో ప‌వ‌న్ చెప్పాలి..వీహెచ్

Update: 2018-01-25 10:30 GMT
జ‌న‌సేన అధ్య‌క్షుడు - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్.....తెలంగాణ‌లో నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న‌ను నిన్న‌టితో ముగించిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ కు తెలంగాణ‌పై - కేసీఆర్ పై హ‌ఠాత్తుగా ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకువ‌చ్చిందంటూ ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం విదిత‌మే. తెలంగాణ‌లో అంతా బాగుందంటున్న ప‌వ‌న్ ఇక్క‌డ ఎందుకు తిరుగుతున్నారంటూ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ.హ‌నుమంత‌రావు తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తి పార్టీకి - నాయ‌కుడికి ఉన్న కమిట్మెంట్ ప్ర‌కారం న‌డుచుకుంటార‌ని, కానీ, జ‌న‌సేనానికి మాత్రం కమిట్మెంటే లేద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎన్ని గంటలకు నిద్ర లేస్తాడో తెలియ‌ని ప‌వ‌న్ ఆయ‌న‌ను క‌ష్ట‌జీవి అని పొగ‌డ‌డం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు. ప‌వ‌న్ ను ఆంధ్రాలో తిర‌గ‌నివ్వ‌రు కాబ‌ట్టే ఇక్క‌డ ప‌ర్య‌టిస్తున్నార‌ని, తెలంగాణలో వాస్తవ పరిస్థితులు ఏమిటో తనతో వస్తే చూపిస్తానని, జనవరి 27 నుంచి ఇద్దరం కలిసి తిరుగుదామ‌ని పవన్ కు స‌వాల్ విసిరారు. పవన్ పార్టీ‘జనసేన’ కాదని - ‘భజనసేన’ అని ఎద్దేవా చేశారు. తాజాగా, ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితం పై వీహెచ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గాంధీభవన్ లో నేడు నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న అనేక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

భార‌తీయ సంస్కృతీ సంప్ర‌దాయాల గురించి గొప్పగా మాట్లాడుతున్న పవన్ కల్యాణ్‌.....మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చా? అని వీహెచ్ ప్రశ్నించారు. అస‌లు ఒక మ‌నిషి ఎన్ని పెళ్ళిళ్లు చేసుకోవ‌చ్చో ప‌వ‌న్ తెల‌పాల‌ని - మూడు పెళ్లిళ్లు చేసుకోవ‌డం క‌రెక్టో కాదో కూడా ఆయ‌న చెప్పాల‌ని అన్నారు. ఓ వైపు ప‌వ‌న్ మూడు పెళ్లిళ్లు చేసుకొని సంతోషంగా ఉండొచ్చ‌ని....కానీ, ఆయ‌న‌తో విడాకులు పొందిన మహిళ మళ్లీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదంటూ ఆయ‌న ఫ్యాన్స్ బెదిరించడం ఎంత‌వ‌ర‌కూ సమంజసమ‌ని వీహెచ్ నిలదీశారు. సంస్కృతీ - సంప్ర‌దాయాలు - ఆచార వ్య‌వ‌హారాల‌ గురించి ప‌వ‌న్ వంటి వ్య‌క్తి మాట్లాడటం హాస్యాస్పదమ‌న్నారు. ఏపీ - తెలంగాణ సీఎంలకు పవన్‌ రాజకీయ పావుగా మారాడని, వాళ్లిద్దరికీ భజన చేయ‌డానికే ఆయ‌న పార్టీ పెట్టాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. నిన్న ఖ‌మ్మంలో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్....కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థిగా వీహెచ్ ను ప్ర‌క‌టిస్తే కాంగ్రెస్ కు మ‌ద్ద‌తిస్తాన‌ని షాకింగ్ కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాను అంద‌రిలాగా విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు చేయ‌బోన‌ని, నిర్మాణాత్మ‌క రాజ‌కీయాలు చేస్తాన‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించిన‌ నేప‌థ్యంలో....వీహెచ్ వ్యాఖ్య‌ల‌పై ఎలా స్పందిస్తారో అన్న సంగ‌తి ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News