తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద తలకాయలు చాలానే ఉన్నా.. విషయం ఏదైనా సరే.. రోడ్ల మీదకు వచ్చి కొట్లాడే నేతల్లో సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి ఎవరైనా సరే.. వారిపై విమర్శనాస్త్రాల్ని ఎక్కుపెట్టేందుకు ఏ మాత్రం వెనుకాడని వీహెచ్ తీరు పుణ్యమా అని మీడియాలో దర్శనమిస్తూ ఉంటారు.
ఎవరి దగ్గర ఎలా వ్యవహరించాలో వీహెచ్ కు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి విషయాల్లో పండిపోయిన ఆయన.. ఇప్పుడు వయోభారంతో ఇబ్బంది పడుతున్నారా? అన్నది ప్రశ్నగా మారింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. ఇది నిజమనిపించక మానదు. ఇంటర్ పరీక్షా ఫలితాలపై అఖిలపక్షం ఏర్పాటు చేసిన నిరసనకు హాజరైన వీహెచ్.. తనకంటే ఎంతో జూనియర్ నేతతో రచ్చ ఒక ఎత్తు అయితే.. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ అగ్రనేతలతో ఆయన వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చగా మారింది.
గతంలో పోలిస్తే ఈ మధ్యన వీహెచ్ లో కోపం అవసరం లేకుండా వస్తుందని.. ప్రతి విషయంలోనూ ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నట్లుగా చెబుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై అనుసరించాల్సిన వూహ్యంపై పార్టీ ముఖ్యులు సమావేశం కాగా.. దీనికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల్ని చూసే కుంతియా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ లోపాల్ని చర్చకు తెచ్చి ఫైర్ కావటం.. పార్టీని ఆగమాగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీ లోపాల్ని ఎత్తి చూపించకూడదని చెప్పట్లేదు.కానీ.. అందుకు సమయం సందర్భం చాలా ముఖ్యం. ఆ విషయాన్ని వదిలేసి.. అదే పనిగా ఫైర్ కావటంతో ఎలాంటి ప్రయోజనం లేదన్న విషయాన్ని వీహెచ్ గుర్తిస్తే మంచిదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. వయోభారంతో పాటు.. ఫస్ట్రేషన్ కూడా వీహెచ్ అనవసర ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు. తనలాంటి సీనియర్ నేతకు లభించాల్సిన మర్యాద.. గౌరవం లభించలేదని భావిస్తున్న హనుమంతన్న.. తామిప్పుడు పవర్లో లేమని.. విపక్షంలో ఉన్నామన్న చిన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.