తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ ఎంపీ వి.హనుమంత రావు మరోమారు నిప్పులు చెరిగారు. నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీ నేత బొడ్డేపల్లి శ్రీనివాస్ హత్య విషయంలో కేసీఆర్ పై సంచలన కామెంట్లు చేశారు. శ్రీనివాస్ హత్య విషయంలో టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ - అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ అసత్య ప్రచారం చేస్తున్నారని వివరించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డిని విమర్శించి...టీఆర్ ఎస్ లో చేరమని శ్రీనివాస్ పై టీఆర్ ఎస్ ఎమ్మెల్యే వీరేశం ఒత్తిడి తెచ్చాడని వీహెచ్ ఆరోపించారు. దానికి ససేమిరా అన్నందుకే శ్రీనివాసును హత్య చేశారని వీహెచ్ దుయ్యబట్టారు.
`ముఖ్యమంత్రి గారు గురుస్వాములను కూడా చంపుతారా?` అని వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. `బొడ్డేపల్లి శ్రీనివాస్ అయ్యప్ప భక్తుడు. గురుస్వామి పాపం ఊరికే పోదు. అయ్యప్ప పాము మీ మెడకు పట్టుకుంటుంది. ఈ పాపం కేసీఆర్ కుటుంబ సభ్యులకు తగులుతుంది. డీజీపీకి పది రోజులు గడువిస్తున్నాం.విచారణలో నిగ్గు తేల్చాలి. లేదంటే సీబీఐ కి అప్పగించాలి. విచారణ సరిగ్గా జరిపించకపోతే కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుంది` అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశంను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. `ఎమ్మెల్యేకు ఒక రూల్...నయీమ్ కు ఒక రూలా? గురుస్వామి పాపం ఊరికే పోదు. తెలంగాణలోని బీసీలందరూ కేసీఆర్ కు గుణపాఠం చెబుతారు.`అని హెచ్చరించారు.
కాళేశ్వరం పేరు మార్చి అంచనాలను 35వేల కోట్ల నుంచి 80 వేలకు పెంచారని అంచనాలు ఏ విధంగా పెరిగాయో చెప్పాలని వీహెచ్ డిమాడ్ చేశారు. ఈ విషయాన్ని తేల్చిన తర్వాతే కాళేశ్వరం సందర్శిస్తామన్నారు. గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఎట్ హోమ్ విందుకు మాజీ మంత్రి దానం నాగేందర్ - ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ వెళ్లడంపై వీహెచ్ స్పందించారు. పీసీసీ నుంచి సరైన సమాచారం అందక పోవటం వల్లే వారు కార్యక్రమమానికి వెళ్లారన్నారు. ఏం జరిగిందో పీసీసీ పెద్దలను అడిగి తెలుసుకుంటానని చెప్పారు.